ఫ్రెంచ్ అధ్యక్షుడి భవనంలో భారీ చోరీ: రూ. 42 లక్షల వెండి వస్తువులు మాయం

ఫ్రెంచ్ అధ్యక్షుడి భవనంలో భారీ చోరీ: రూ. 42 లక్షల వెండి వస్తువులు మాయం

ఫ్రెంచ్ దేశ ఆధ్యక్షుడి అధికారిక నివాసమైన ఎలిసీ ప్యాలెస్ లో పనిచేసే  ఉద్యోగే దొంగగా మారిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. సుమారు రూ. 42 లక్షల విలువైన పురాతన వెండి వస్తువులు, విలువైన పాత్రలు ఎలిసీ ప్యాలెస్ లో మాయం అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వెండి వస్తువుల సంరక్షకుడు  సిల్వర్ స్టీవార్డ్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలు ఎం జరిగిందంటే: ఫ్రెంచ్ అధ్యక్ష భవనంలో కొన్ని పురాతన వస్తువులు కనిపించడం లేదని అక్కడి అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్యాలెస్‌కు వెండి పాత్రలు సప్లయ్ చేసే సంస్థ కొన్ని పాత వస్తువులను ఆన్‌లైన్ వేలం సైట్లలో చూసి అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులకు అక్కడ పనిచేసే ఒక ఉద్యోగిపై అనుమానం వచ్చింది. అతను ఇంకా దొంగతనాలకు ప్లాన్ చేస్తున్నట్లు కొన్ని ఆధారాలు కూడా దొరికాయి.

దింతో దర్యాప్తు అధికారులు నిందితుడి వాహనం,  పర్సనల్ లాకర్, ఇంటిని చెక్ చేయగా సుమారు 100 రకాల వస్తువులు బయటపడ్డాయి. వీటిలో పురాతన రాగి పాత్రలు, ఖరీదైన సెవ్రెస్ పింగాణీ వస్తువులు, విలువైన విగ్రహాలు, బాకరట్ షాంపైన్ గ్లాసులు ఉన్నాయి.

అయితే నిందితుడు పాత వస్తువులను అమ్మే ఒక కంపెనీ మేనేజర్‌తో కలిసి ఈ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆన్‌లైన్ సేల్స్ సైట్లలో సామాన్య ప్రజలకు దొరకని ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ మార్క్ ఉన్న ప్లేట్లు, యాష్‌ట్రేలను వీరు అమ్మకానికి పెట్టారు. 

 ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న వస్తువులను తిరిగి అధ్యక్ష భవనానికి అప్పగించారు. జాతీయ వారసత్వ సంపదను దొంగిలించినందుకు ఈ ముగ్గురు నిందితులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అలాగే సుమారు రూ. 1.3 కోట్ల జరిమానా పడే అవకాశం ఉంది. కోర్టు ఈ కేసు విచారణను ఫిబ్రవరి 26కి వాయిదా వేయగా... అప్పటివరకు నిందితులు ఒకరినొకరు కలుసుకోకూడదని కోర్టు ఆదేశించింది.