పాకిస్తాన్ లో బాంబు పేలుడు..25 మంది మృతి, 30 మందికి గాయాలు

పాకిస్తాన్ లో బాంబు పేలుడు..25 మంది మృతి, 30 మందికి గాయాలు

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం (ఫిబ్రవరి 7) భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్‌లోని షెహబజాద్ టౌన్ ప్రాంతం, తర్లై ఇమామ్ దర్గా సమీపంలో శుక్రవారం ప్రార్థనలు ముగిసిన కొద్దిసేపటికే ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.ఈ పేలుడులో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో దర్గా పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోయింది. ఘటనాస్థలంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది ఆత్మాహుతి బాంబు దాడిగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ప్రార్థనల అనంతరం పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్న క్రమంలో దుండగుడు పేలుడు జరిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

►ALSO READ | అమెరికా.. ఇరాన్ యుద్ధం మొదలవుతుందా: అర్జెంట్‌గా ఇరాన్ నుంచి వెళ్లిపోవాలని అమెరికా హెచ్చరిక ఎందుకు..?

సమాచారం అందుకున్న వెంటనే పోలీస్‌, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ ఘటన తర్వాత ఇస్లామాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేశారు.