అమెరికా ఇరాన్ దేశాల మధ్య మళ్లీ హై టెన్షన్. ఇరాన్ దేశంలో ఉన్న అమెరికా పౌరులు, దౌత్యవేత్తలు, ఇతర అధికారులు, ప్రజలు ఎవరైనా సరే.. వాళ్లు అమెరికన్లు అయితే.. అర్జంట్ గా.. ఉన్న ఫళంగా.. వెంటనే ఇరాన్ దేశం వదిలి వెళ్లిపోవాలని.. ఇరాన్ దేశం గడ్డ వీడాలని.. ఇరాన్ దేశంలో ఉండొద్దని అమెరికా హెచ్చరించింది. అర్జెంట్ గా ఇలాంటి వార్నింగ్స్ ఇవ్వటంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్ పై అమెరికా యుద్ధానికి రెడీ అవుతుందని.. ఏ క్షణమైనా యుద్ధం మొదలవ్వొచ్చని.. అందుకే ఇలాంటి హెచ్చరికలు ఇచ్చినట్లు ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఇదే సమయంలో ఒమన్ వేదికగా ఇరాన్ దేశంతో అమెరికా చర్చ జరగాల్సి ఉంది. చర్చలు ప్రారంభం కాకముందే.. అమెరికా ఇలాంటి హెచ్చరికలు చేయటం చూస్తుంటే.. ఏదో జరగబోతుందనే అనుమానాలు అందరిలో ఉన్నాయి.
ALSO READ : షట్.. ఎంత డబ్బా కొట్టిన పని కాలే
ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారా స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్‌లో నివసిస్తున్న తమ దేశ పౌరులను ఉద్దేశించి వర్చువల్ యూఎస్ ఎంబసీ శుక్రవారం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తతలు వేగంగా పెరుగుతున్నందున, వీలైనంత త్వరగా ఇరాన్‌ను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా తన పౌరులను ఆదేశించింది. ముఖ్యంగా స్థానిక మౌలిక సదుపాయాల ఇబ్బందులు, కమ్యూనికేషన్ వ్యవస్థల వైఫల్యం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంబసీ స్పష్టం చేసింది.
ALSO READ : మా చమురు కొనబోమని ఇండియా చెప్పలేదు
🇺🇸BREAKING:
— Commentary: Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) February 6, 2026
US Embassy tells citizens to ‘LEAVE #IRAN NOW’ pic.twitter.com/FarmvqQvIm
ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం మొబైల్ నెట్‌వర్క్‌లు, ల్యాండ్‌లైన్లు, ఇంటర్నెట్ సేవలను తీవ్రంగా నియంత్రిస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. రహదారుల మూసివేత.. ప్రజా రవాణాలో అంతరాయాలు, విమాన సర్వీసులు రద్దు అయ్యే అవకాశం ఉన్నందున ఏ క్షణంలోనైనా పరిస్థితి విషమించవచ్చని హెచ్చరించింది. వెంటనే ఇరాన్ విడిచి వెళ్లండి. ప్రయాణాల విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయాన్ని ఆశించకుండా.. మీ సొంత ఏర్పాట్లతోనే సురక్షిత దేశాలకు చేరుకోండని అమెరికా అధికారులు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ దేశాన్ని విడిచి వెళ్లడం సాధ్యం కాకపోతే.. తగినంత ఆహారం, నీరు, మందులను నిల్వ చేసుకుని సురక్షితమైన భవనాల్లో తలదాచుకోవాలని సూచించారు.
ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి ఈ హెచ్చరికలు మరింత కీలకంగా మారాయి. ఇరాన్ ప్రభుత్వం ద్వంద్వ పౌరసత్వాన్ని గుర్తించదని.. వారిని కేవలం ఇరాన్ పౌరులుగానే పరిగణిస్తుందని యూఎస్ ఎంబసీ గుర్తు చేసింది. అమెరికాతో సంబంధం ఉన్న వారిని ఇరాన్ అధికారులు ప్రశ్నించే అరెస్టు చేసే లేదా నిర్బంధించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అమెరికా పౌరులు తమ ఫోన్లను ఎప్పటికప్పుడు ఛార్జ్ చేసుకుని ఉంచుకోవాలని, ఎప్పుడూ లో-ప్రొఫైల్‌లో ఉంటూ నిరసనలకు దూరంగా ఉండాలని సూచించింది.
ALSO READ : ఇండియాకు మరో గుడ్ న్యూస్
ప్రస్తుతానికి విమాన సర్వీసులు పరిమితంగా ఉన్నందున, రోడ్డు మార్గంలో సరిహద్దులు దాటడం మంచిదని ఎంబసీ సూచించింది. అర్మేనియా, టర్కీ సరిహద్దులు ప్రస్తుతం తెరిచి ఉన్నాయని.. అమెరికా పాస్‌పోర్ట్ ఉన్నవారు అక్కడ వీసా లేకుండా ప్రవేశించవచ్చని ఎంబసీ వెల్లడించింది. తుర్క్మెనిస్తాన్.. అజర్బైజాన్ బోర్డర్ ద్వారా వెళ్లాలనుకునే వారు ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. ఏదేమైనా అత్యంత అప్రమత్తంగా ఉంటూ స్మార్ట్ ట్రావెలర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నిరంతరం సమాచారాన్ని అందుకుంటూ ఉండాలని అమెరికా పౌరులకు గట్టి ఆదేశాలు జారీ అయ్యాయి. ఇదంతా చూస్తుంటే పరిస్థితులు యుద్ధానికి చాలా దగ్గరగా ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇప్పటికే ఇరాన్ చుట్టూ తమ నౌకా దళాన్ని పెట్టగా.. ఇరాన్ కూడా అదే స్థాయిలో యుద్ధానికి సిద్ధం అవుతోంది.
