ట్వెల్త్ ఫెయిల్ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ హీరో విక్రాంత్ మాస్సే. 2024 చివర్లో ఆయన తన రిటైర్మెంట్ గురించి ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. కుటుంబానికి పూర్తిస్థాయిలో సమయం కేటాయించాల్సిన సమయం వచ్చిందని, ఇకపై కొత్త సినిమాలు అంగీకరించబోనని ఆ పోస్టులో రాసుకొచ్చాడు. అయితే ఆ తర్వాత ఏడు నెలలకే ఒక కొత్త ప్రాజెక్ట్‌ను ఆయన అంగీకరించారు. ఈ మధ్యకాలంలో ఆయన బ్రేక్‌పై అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వాటిపై లేటెస్ట్గా విక్రాంత్ స్పందించారు.
తన రిటైర్మెంట్ ప్రకటనను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన తెలిపారు. రోజుకు 14 నుంచి 16 గంటలు పని చేయడం తనకు కష్టంగా అనిపించిందని చెప్పారు. వరుస ప్రాజెక్టులతో శారీరకంగా, మానసికంగా అలసిపోవడం వల్లే తాత్కాలిక విరామం తీసుకున్నానని వెల్లడించారు. ఆ సమయంలో తాను చేసిన సినిమాలు విజయవంతమైనప్పటికీ, ఏడాదికి నాలుగు చిత్రాలు చేయడం చాలా భారంగా మారిందని విక్రాంత్ స్పష్టం చేశారు.
ALSO READ : ‘జన నాయగన్’ విడుదలపై కీలక మలుపు..
విక్రాంత్ మాస్సే: ట్వెల్త్ ఫెయిల్, సెక్టార్ 36 లాంటి చిత్రాలతో నటుడిగా చక్కని గుర్తింపును అందుకున్నాడు విక్రాంత్ మాస్సే. గతేడాది సెక్టార్ 36 (Sector 36) అనే క్రైమ్ థ్రిల్లర్తో వచ్చి తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. అలాగే ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report) రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో జర్నలిస్టు పాత్రలో నటించి మెప్పించాడు.
అయితే ఈ రియల్ హీరో (2025 డిసెంబర్ 2న) రిటైర్మెంట్ తీసుకుంటున్న అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అది రిటైర్మెంట్ కాదు, విరామమే అని ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
