Prabhas: ప్రభాస్‌కు అంతర్జాతీయ గౌరవం.. సోలో హీరోగా ఆ దేశ కవర్ పేజీపై చరిత్ర

Prabhas: ప్రభాస్‌కు అంతర్జాతీయ గౌరవం.. సోలో హీరోగా ఆ దేశ కవర్ పేజీపై చరిత్ర

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో మాత్రమే కాదు, వ్యక్తిత్వంతోనూ కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న హీరోగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వరుస బ్లాక్‌బస్టర్ చిత్రాలు, బాక్సాఫీస్ రికార్డులు, అభిమానుల పట్ల ప్రేమాభిమానాలు – ఇలా ప్రతి విషయంలోనూ ప్రభాస్ తనదైన ముద్ర వేసుకుంటూ తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును తీసుకొచ్చారు.

ఇప్పుడు మరోసారి ప్రభాస్ గ్లోబల్ స్టార్‌గా తన స్థాయిని చాటుకున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ‘అనన్ (Anan)’ కవర్ పేజీపై ప్రభాస్ చోటు దక్కించుకోవడం విశేషంగా మారింది. ఈ నెల 10న విడుదల కానున్న మ్యాగజైన్ 2,483వ సంచిక బ్యాక్ కవర్‌పై ప్రభాస్ ఫోటో కనిపించనుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ కొత్త రికార్డు సృష్టించారు.

గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విజయంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించారు. అయితే, ఒక భారతీయ నటుడిగా సోలోగా ‘అనన్’ కవర్‌పై చోటు దక్కించుకున్న మొదటి హీరో ప్రభాస్ కావడం ప్రత్యేకంగా నిలుస్తోంది.

►ALSO READ | Mardaani 3: ఢిల్లీ మిస్సింగ్ కేసుల్ని.. ‘మర్దానీ 3’ ప్రమోషన్ కోసం వాడుకోలే: YRF సంస్థ క్లారిటీ

‘ఇర్రెసిస్టబుల్ ఫీలింగ్స్’ థీమ్‌తో రూపొందిన ఈ సంచికలో ప్రభాస్‌ను ‘రాయల్ ఆడియన్స్ గ్రావ్యూర్’గా అభివర్ణించడం అభిమానుల్లో మరింత ఆనందాన్ని నింపింది. ఈ ఫోటోషూట్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్, రాయల్ పర్సనాలిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. #PrabhasOnAnan, #GlobalStarPrabhas హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ప్రభాస్‌కు లభించిన ఈ అరుదైన గౌరవం భారతీయ సినిమాకు దక్కిన మరో గొప్ప గుర్తింపుగా అభిమానులు భావిస్తున్నారు. ఇటీవలే ప్రభాస్ ది రాజాసాబ్తో ఆడియన్స్ను అలరించారు. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూటింగ్స్‌‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సలార్: పార్ట్ 2 – శౌర్యాంగ పర్వం, కల్కి 2 సినిమాలు చేయాల్సి ఉంది.