అంబేద్కర్ స్ఫూర్తితోనే కాకా విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ తో పాటు స్పీకర్ గడ్డం ప్రసాద్, అంబేద్కర్ కాలేజీల సెక్రటరీ వినోద్, కరస్పాండెంట్ డాక్టర్ సరోజ వివేక్ హాజరయ్యారు..
ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి వివేక్.. పేద మధ్య తరగతి పిల్లలకు అంబేద్కర్ కాలేజీల్లో మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు. అందరు చదువుకోవాలనే అంబేద్కర్ విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని చెప్పారు. పేద పిల్లలకు నాణ్యమైన ఉన్నత విద్య అందాలనే కాకా ఆశయమన్నారు. కాకా ఆశయ సాధనలో భాగంగా పేదలకు మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పారు వివేక్. జాతీయ స్థాయిలో అంబేద్కర్ కాలేజీకి మంచి గుర్తింపు ఉందన్నారు. కాకా కృషితో ఉప్పల్లో రాజీవ్ గాంధీ స్టేడియం రూపుదిద్దుకుందని చెప్పారు.
కేంద్రమంత్రిగా కాకా విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని చెప్పారు మంత్రి వివేక్ . కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పెన్షన్ సౌకర్యం కల్పించారని తెలిపారు. నష్టాల్లో ఉన్న సింగరేణిని పీవీతో మాట్లాడి కాకా ఆదుకున్నారని తెలిపారు.కాకా కృషితోనే సింగరేణి లాభాల్లో నడుస్తోందన్నారు. టెక్స్ టైల్ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చారని చెప్పారు. కాకా కృషితో రామగుండం ప్లాంట్ ఏర్పాటైందన్నారు వివేక్... కాకా పోరాటంతో హైదరాబాద్ లో వేలాది మంది కార్మికులకు ఇండ్ల స్థలాలు వచ్చాయని చెప్పారు.
