మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ అంసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని..అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. అద్దె భవనాల్లో గురుకులాలు నడిపింది బీఆర్ఎస్సేనని మండిపడ్డారు. మీరు కట్టిన కాళేశ్వరం ప్రజలంతా చూశారన్నారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడాలి..మీ తోలు తీస్తామంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు పొన్నం. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని చెప్పారు.
ALSO READ : రాజ్యాంగాన్ని మార్చేందుకు మోదీ కుట్ర
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు. కిషన్ రెడ్డికి చేతనైతే నిధులు తేవాలని సవాల్ విసిరారు పొన్నం. తమకు తెలంగాణ ప్రజలే బాసులని..వారికే సమాధానం చెబుతామన్నారు. దేశం కోసం ఇందిర రాజీవ్ ప్రాణాలు అర్పించారన తెలిపారు. మహాత్మగాంధీ పేరు రూపుమాపేందుకే కేంద్రం కుట్ర చేస్తుందన్నారు.
రెండేండ్ల టైమిచ్చాం..తోలు తీస్తాం
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 టీఎంసీలే కావాలంటూ కేంద్రానికి లెటర్ ఎలా రాస్తారని, కేంద్రం డీపీఆర్‌ను ఎలా తిప్పి పంపుతుందని ఆయన ప్రశ్నించారు. రెండేండ్ల నుంచి పాలమూరు ప్రాజెక్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదన్నారు. ‘‘రెండేండ్లు చూస్తూ ఊరుకున్నాం. ఇక ఊరుకోకూడదనే బయల్దేరిన. వీళ్లు అడ్డంపొడవు మాట్లాడి.. కిరికిరిలు, కారుకూతలు కూసి ఏదో చేస్తమంటే నడ్వదు. ఇయ్యాల్టిదాకా ఒక కథ.. ఇక నుంచి ఇంకో కథ ఉంటది. ఎక్కడికక్కడ తోలు తీస్తం” అని ఆయన హెచ్చరించారు.
