నాటకరంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది: బాదిమి శివకుమార్

నాటకరంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది: బాదిమి శివకుమార్

నాటకరంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ బాదిమి శివకుమార్. యువతకు నాటక రంగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. డి స్వేర్ సంస్కృతి, కళా వికాస కేంద్ర సంస్థ లోగో ఆవిష్కరణ కార్యక్రమం రవీంద్ర భారతిలో నిర్వహించారు. నాటకం సినిమాకు నాడి లాంటిదన్నారు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. ఎంతో మంది కళాకారులను రవీంద్ర భారతి వేదిక తీర్చిదిద్దిందని గుర్తుచేశారు.