Aa Okati Adakku OTT: రెండు OTTలోకి వచ్చేస్తున్న అల్లరోడి కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aa Okati Adakku OTT: రెండు OTTలోకి వచ్చేస్తున్న అల్లరోడి కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ హీరో అల్లరి నరేశ్(Allari Naresh) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు(Aa Okati Adakku). జాతిరత్నాలు ఫేమ్ ఫారియా అబ్దుల్లా(Faria Abdhulla) హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాను కొత్త దర్శకుడు మల్లి అంకం(Malli Ankam) తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అల్లరి నరేష్ కూడా ఈ మధ్య కామెడీ సినిమాలు చేయలేదు. అందుకే ఆ ఒక్కటి అడక్కు సినిమా చూసేందుకు ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. కానీ, సినిమాలో మ్యాటర్ లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది ఈ సినిమా. 
 
దాంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను రెండు ఓటీటీ సంస్థలు ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత సమాచారం మేరకు మే 31న ఈ సినిమా స్ట్రీమింగ్ లోకి రానుందట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట. నిజానికి.. థియేటర్స్ లో ఈ సినిమా సరిగా ఆడకపోడంతో ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు ఆడియన్స్. అందుకే ఆ ఒక్కటి అడక్కు ఓటీటీ విడుదల గురించి తెలిసి హ్యాపీ ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో ప్లాప్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. 

ఇక ఆ ఒక్కటి అడక్కు సినిమా కథ విషయానికి వస్తే.. గ‌ణ‌ప‌తి (అల్ల‌రి న‌రేష్‌)కి 30 ఏళ్లు. అతనొక ప్ర‌భుత్వ ఉద్యోగి అయినప్పటికీ పెళ్లికాదు. వ‌చ్చిన సంబంధాల‌న్ని ఎదో కారణంగా రిజెక్ట్ అవుతుంటాయి. అయితే.. కొన్ని అనుకోని కారణాల వల్ల సిద్ధిని (ఫ‌రియా అబ్దుల్లా) త‌న లవర్ గా కుటుంబ‌స‌భ్యుల‌కు ప‌రిచ‌యం చేస్తాడు గ‌ణ‌ప‌తి. అదే సమయంలో మ్యాట్రిమెనీ పేరుతో మోసాల‌కు పాల్ప‌డుతుందంటూ సిద్ధి గురించి పేప‌ర్ల‌లో న్యూస్ వ‌స్తుంది? అది చూసిన గణపతి ఎం చేశాడు? సిద్ధి గురించి వ‌చ్చిన వార్త నిజ‌మేనా? అనేది మిగిలిన కథ.