ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీ

ఇవాళ తెలంగాణ కేబినెట్‌ భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ఇవాళ సాయంత్రం కేబినెట్‌ మీటింగ్ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు బేగంపేట క్యాంప్ ఆఫీస్ జరగనున్న భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. కోర్టు కేసులు, కొత్త సెక్రటేరియట్ నిర్మాణాలతో పాటు రాష్ట్రంలో పెండింగ్ సమస్యలు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల వ్యూహాల పైనా మంత్రులతో చర్చించనున్నారు CM.  వాటితో పాటుగా పాత భవనాల కూల్చివేత, పోస్టుల భర్తీ, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు అంశాలపై చర్చించనుంది. RTC సమ్మెపై  కూడా మాట్లాడతారని తెలుస్తుంది.

ఇప్పటికే కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం… హైకోర్టులో ఉన్న కేసులపై చర్చించడంతో పాటు భవనాల డిజైన్లను ఫైనల్ చేసే చాన్సుంది.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై ఫోకస్ చేయనుంది కేబినెట్. కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రైతు సమన్వయ సమితులతో నేరుగా రైతుల దగ్గరే ధాన్యం కొనుగోలు, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచడం, PRC అమలుపై మంత్రులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కొత్త రెవెన్యూ చట్టం అమలు, కొత్త మున్సిపల్ యాక్ట్, సర్పంచ్ ల ఆందోళన వంటి అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే ఆవకాశం ఉంది. ఇక ఆర్టీసీలో కార్మికుల సమ్మె నోటీసు అంశాలపై కూడా మాట్లాడతారని తెలుస్తుంది.

రాష్ట్రంలో బీజేపీ దూకుడు, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు చర్చించనున్నారు. ఏపీ సీఎం జగన్ తో భేటీ వివరాలను ఈ సమావేశంలో కేసీఆర్ మంత్రులకు వివరిస్తారని సమాచారం.

Cabinet meeting on this evening chaired by CM KCR