జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కు బెయిల్ రద్దు

జగన్ పై కత్తితో దాడి చేసిన శ్రీనివాస్ కు బెయిల్ రద్దు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై దాడికేసు నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ రద్దయ్యింది. శ్రీనివాసరావుకు బెయిల్ రద్దు చేస్తూ ఇవాళ(శుక్రవారం) హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.

హైకోర్టులో ఇరువర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే NIA వాదనతో ఏకీభవించిన కోర్టు శ్రీనివాస్‌ బెయిల్‌ రద్దు చేసింది. అయితే నిందితుడు బెయిల్‌పై అప్పీలు చేసుకునే అవకాశాన్ని హైకోర్టు కల్పించింది.

శ్రీనివాస్‌కు ఈ ఏడాది మే 22న బెయిల్‌ మంజూరు కాగా, 25న జైలు నుంచి విడుదల అయ్యాడు. దీంతో కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని NIA ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ హైకోర్టులో అభ్యర్థించారు.

2018 అక్టోబర్ 25న వైఎస్‌ జగన్‌పై శ్రీనివాసరావు కత్తితో  విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో  దాడి చేశాడు.

cancel-of-srinivasa-rao-bail-in-ys-jagan-attack-case