ప్రతిపక్షాల వీవీప్యాట్ల విజ్ఞప్తిని తిరస్కరించిన CEC

ప్రతిపక్షాల వీవీప్యాట్ల విజ్ఞప్తిని తిరస్కరించిన CEC

ఢిల్లీ : వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కౌంటింగ్ కు ముందే వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలి అన్న ప్రతిపక్షాల విజ్ఞప్తిని ఎన్నికల సంఘం ఒప్పుకోలేదు. ఇప్పటికే నిర్ణయించిన కౌంటింగ్ ప్రక్రియను మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. యధావిధిగా పాత మార్గదర్శకాలను అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

మంగళవారం న్యూ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలిసింది ప్రతిపక్ష నేతల బృందం. ఎన్నికల కౌంటింగ్ సమయంలో వీవీప్యాట్​మెషిన్లను ముందు లెక్కించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 5 మెషిన్లలో పోలైన ఓట్లను ఈవీఎంలతో సరిపోల్చాలని, అందులో తేడాలుంటే ఆ నియోజకవర్గంలోని అన్ని వీవీప్యాట్ మెషిన్లను లెక్కించాలని కోరారు.

విపక్షాలు చేసిన ఈ విజ్ఞప్తిని ఈసీ ఇవాళ తిరస్కరించింది.