స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్

స్వాతి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్

ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.ఆప్ రాజ్యసభ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేజ్రీవాల్ పీఏ బీభవ్‌పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కేజ్రీవాల్ ఇంటి నుంచి వైభవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్ అరెస్టుపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ కాపీ రాలేదని కోర్టులో పిటిషన్ వేసినట్లు ఆప్ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాసియార్ తెలిపారు.ఎలాంటి నోటీసు లేకుండా బిభవ్ ను అదుపులోకి తీసుకున్నారని నాసియార్ అన్నారు. అయితే ఈరోజు బిభవ్ ను ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. 

ఇదిలా వుంటే.. సిఎం నివాసంలోకి మాలివాల్ అనధికారికంగా ప్రవేశించి.. తనను దూషించారని ఆరోపిస్తూ బిభవ్ శుక్రవారం పోలీసులకు కౌంటర్ ఫిర్యాదు చేశారు.