చెన్నైదూకుడుకు సన్ రైజర్స్ చెక్ పెట్టేనా?

చెన్నైదూకుడుకు సన్ రైజర్స్ చెక్ పెట్టేనా?

హైదరాబాద్:  వరుస ఓటములతో డీలా పడిన సన్‌‌రైజర్స్‌‌ సొంతగడ్డ హైదరాబాద్‌ పై మరోపోరుకు రెడీ అయింది.ఈ సీజన్‌‌ ఐపీఎల్‌‌లోనే టాప్‌ ఫామ్‌ లో ఉన్నచెన్నై సూపర్‌‌కింగ్స్‌‌తో బుధవారం అమీతుమీ తేల్చుకోనుంది. గత మూడు మ్యాచ్‌‌ల్లో ఓడిపోయి డీలాపడిన ఆరెంజ్‌ ఆర్మీ.. సొంతగడ్డపై నెగ్గి మళ్లీగెలుపుబాట పట్టాలని భావిస్తోంది. పాయింట్లపట్టికలో టాప్‌ ప్లేస్‌‌లో కొనసాగుతోన్న ధోనీ సేన ఇంకో విజయం సాధించి అందరి కంటే ముందుప్లేఆఫ్‌ బెర్త్‌‌పై కన్నేసింది. ఈ నేపథ్యంలో ధోనీ సేనజోరును ఆరెంజ్‌ ఆర్మీ ఏ మేరకు అడ్డుకుంటుందనేది రసవత్తరంగా మారింది.

మిడిల్బెంగ తీరేనా..

ఈ సీజన్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ను ఆందోళన కలిగిస్తున్నఅంశం ఏదైనా ఉందంటే అది మిడిలార్డర్‌‌ వైఫల్యమే. జట్టు బ్యాటింగ్‌‌ భారమంతా ఓపెనర్లే మోస్తున్నారు. దీంతో సులువుగా గెలవాల్సిన మ్యాచ్‌‌లనుకూడా ఓడిపోతున్నామని, ఇప్పటికైనా మిడిలార్డర్‌‌ కాస్త బాధ్యతగా ఉండాలని టీమ్‌ మేనేజ్‌ మెంట్‌‌ అంటోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యా పిటల్స్‌‌తో జరిగినమ్యాచ్‌‌ రైజర్స్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌ లోని డొల్లతనాన్ని బయటపెట్టింది. టీమ్‌ మేనేజ్‌ మెంట్‌‌ మిడిలార్డర్‌‌లో ఎన్ని కాంబినేషన్లు మార్చిన ఫలితం కనిపించడం లేదు. మనీశ్ పాండే, దీపక్‌‌ హుడా,యూసుఫ్‌ పఠాన్‌‌ ఇకనైనా తమ బ్యాట్లకు పనిచెప్పకపోతే జట్టు ప్లే ఆఫ్‌ రేసులో నిలబడడం సాధ్యం కాదు. ఇక గతమ్యాచ్‌‌లో అవకాశందక్కించుకున్న రికీ భుయ్‌ చెత్త ఆటతీరుతో తనప్లేస్‌‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఓపెనర్లు జానీబెయిర్‌‌స్టో , డేవిడ్‌ వార్నర్‌‌ సూపర్‌‌ ఫామ్‌ ఒక్కటేజట్టుకు కలిసొచ్చే అంశం. ఈ సీజన్‌‌లో ఇప్పటి దాకా 400 రన్స్‌‌ చేసిన వార్నర్‌‌ ప్రస్తుతం ఆరెంజ్‌క్యాప్‌ ను సొంతం చేసుకోగా, మరో ఓపెనర్‌‌ బెయిర్‌‌ స్టో కూడా భీకరఫామ్‌లో ఉన్నాడు.పూర్తిగా వీరిద్దరిపైనే ఆధారపడకూడదని సన్‌‌రై-జర్స్‌‌ మేనేజ్‌ మెంట్‌‌ ఆలోచిస్తోంది. మరోవైపుపేస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ విజయ్‌ శంకర్‌‌ కూడా గాడినపడాల్సి ఉంది. అంతేకాక కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ వీలైనంత త్వరగా ఫామ్‌ లోకి రావాలని జట్టుఆశిస్తోంది. ఇక బౌలింగ్‌‌లో భువనేశ్వర్‌‌ కుమార్‌‌,సందీప్‌ శర్మ ఆకట్టుకుంటున్నారు . గత మ్యాచ్‌‌లోఆడిన ఖలీల్‌‌ అహ్మద్‌ సత్తాచాటాడు. ఇక ఆల్‌‌రౌండర్‌‌ రషీద్‌ ఖాన్‌‌ రెండు విభాగాల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉన్న సన్‌‌రైజర్స్‌‌ సొంతగడ్డపై బుధవారం జరిగే మ్యాచ్‌‌లోగెలిచి ముందంజ వేయాలని కోరుకుంటోంది.

అందరి దృష్టి రాయుడుపైనే..

ప్రపంచకప్‌ బెర్త్‌‌ దక్కకపోవడంతో నిరాశలో ఉన్నతెలుగు ప్లేయర్‌‌ అంబటి తిరుపతి రాయుడుపైనేబుధవారం నాటి మ్యాచ్‌‌లో అందరి దృష్టి ఉంది.గత నవంబర్‌‌ వరకు జాతీయ జట్టులో చోటుఖాయమనుకున్న రాయుడు.. పేలవఫామ్‌ వల్లవరల్డ్‌‌కప్‌ టికెట్‌‌ మిస్సయ్యా డు. ఈక్రమంలోహైదరాబాద్‌ లో జరిగే మ్యాచ్‌‌లో సత్తాచాటాలని భావిస్తున్నాడు. మరోవైపు చెన్నై కెప్టెన్‌‌ ఎంఎస్‌‌ ధోనీ ఏం పట్టుకున్నా బంగారంగా మారుతోంది.ఎన్ని కాంబినేషన్లు మార్చినా అవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయి . ఈ నేపథ్యంలో ఎనిమిది మ్యా చ్‌‌ల్లో ఏడు విజయాలు సాధించి ప్లే ఆఫ్‌ బెర్త్‌‌కుమరో అడుగు దూరంలో నిలిచింది. బుధవారంమ్యాచ్‌‌లో విజయం సాధించి పట్టికలో తమ అగ్ర-స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది.ఓపెనర్‌‌ షేన్‌‌ వాట్సన్‌‌ మినహా బ్యాట్స్‌‌మెన్‌‌ అంతాసూపర్‌‌ ఫామ్‌ లో ఉన్నారు . బౌలింగ్‌‌లో వెటరన్‌‌ స్పిన్‌‌ ద్వయం ఇమ్రాన్‌‌ తాహిర్‌‌, హర్బజన్‌‌ సింగ్‌‌ దుమ్మురేపుతున్నారు . పేసర్లలో దీపక్‌‌ చహర్‌‌,శార్దూల్‌‌ ఠాకూర్‌‌ ఆకట్టుకుంటున్నారు . ఈక్రమంలో పేపర్‌‌పైనే కాకుండా మైదానంలో నూ సీఎస్కే చాలా బలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తమవిజయాల జోరును హైదరాబాద్‌ లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

జట్లు (అంచనా)

సన్ రైజర్స్ హైదరాబాద్ : విలియమ్సన్‌‌ (కెప్టెన్‌‌),వార్నర్‌‌, బెయిర్‌‌స్టో , భుయ్‌ /యూసుఫ్‌ , మనీశ్‌‌,దీపక్‌‌/అభిషేక్‌‌, విజయ్‌ శంకర్‌‌, రషీద్‌ , భువనేశ్వర్‌‌, ఖలీల్‌‌, సందీప్‌.

చెన్నై సూపర్‌‌ కింగ్స్ : ధోనీ (కెప్టెన్‌‌), వాట్సన్‌‌, డుప్లెసిస్‌‌, రాయుడు, రైనా, జడేజా, జాడేజా, జాదవ్‌ , చహర్‌‌,ఠాకూర్‌‌, శాంట్నర్‌‌, తాహిర్‌‌.