మా కిట్లు మంచివే.. మీరు టెస్టులు చేసిన టైమింగే తప్పు

మా కిట్లు మంచివే.. మీరు టెస్టులు చేసిన టైమింగే తప్పు
  • తమ కిట్లను సమర్థించుకున్న చైనా
  • పుణే ఎన్‌ఐవీ అప్రూవ్‌ చేసిందని వెల్లడి

చెన్నై: చైనా నుంచి ఇంపోర్ట్‌ చేసుకున్న ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లు నాణ్యమైనవి కావని, అవి వాడొద్దని మన దేశం ప్రకటించిన నేపథ్యంలో చైనా కంపెనీలు స్పందించాయి. తాము పంపిన కిట్లు క్వాలిటీవని, ఇండియాలో టెస్టులు చేస్తున్న టైమింగ్‌లో ఉన్న డిఫరెన్స్‌ వల్ల అలా తప్పు రిజల్ట్‌ వచ్చిందేమో అని సమర్థించుకున్నాయి. తమ కిట్లను పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) అప్రూవ్‌ చేసిందని వండ్ఫో బయోటెక్‌ కంపెనీ చెప్పింది. “ ఇండియా నుంచి ఇంపోర్ట్‌ లైసెన్స్‌ తీసుకున్న మొదటి కంపెనీ వండ్ఫో. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ – పుణే ద్వారా ఐసీఎంఆర్‌‌ దాన్ని వ్యాలిడేట్‌ చేసింది. మా కంపెనీ క్వాలిటీకి చాలా ప్రియారిటీ ఇస్తుంది. మా ప్రాడెక్ట్‌ స్టాండర్డ్స్‌పై మాకు చాలా నమ్మకం ఉంది. చైనాలోనే కాదు మేం ఎక్స్‌పోర్ట్‌ చేసే ప్రతి దేశంలోనూ మా ప్రాడెక్ట్‌కు మంచి పేరు ఉంది” అని కంపెనీ స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్ల స్టోరేజ్‌, రవాణా, వాడకంలో జాగ్రత్తలు పాటించకపోవడం కిట్‌ పనితీరుపై ప్రభావం చూపుతుందని కంపెనీ చెప్పింది. చైనాకు చెందిన గువాంగ్‌ జో వండ్ఫో బయోటెక్‌, జుహార్‌‌ లివ్సోన్‌ డయాగ్నస్టిక్స్‌కు చెందిన రాపిట్‌ టెస్టింగ్‌ కిట్లు కరోనా వ్యాధి నివారణ పరీక్షల్లో సరైన రిజల్ట్‌ ఇవ్వడం లేదని ఐసీఎంఆర్‌‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ రెండు కంపెనీల కిట్లు ఉపయోగించొద్దని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చింది.