మే 7 వరకు లాక్ డౌన్.. ఎలాంటి సడలింపులు లేవు

మే 7 వరకు లాక్ డౌన్.. ఎలాంటి సడలింపులు లేవు

హైద‌రాబాద్: లాక్ డౌన్ ఆంక్ష‌ల్లో స‌డ‌లింపుపై ఆదివారం సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన రాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. త‌ర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం…రాష్ట్రంలో ఆదివారం 18 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు. తాజా కేసుల‌తో రాష్ట్రంలో 858 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 651 మంది ట్రీట్ మెంట్ తీసుకుంటున్నార‌న్నారు. 186 మంది డిశ్చార్జి కాగా..ఇప్ప‌టివ‌ర‌కు 21 మంది చ‌నిపోయార‌ని తెలిపారు.

క‌రోనా సోకిన వారి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని.. నాలుగు జిల్లాలో క‌రోనా ప్ర‌భావం లేద‌న్నారు. కేంద్రం విధించిన స‌డ‌లింపుపై మంత్రుల‌తో చ‌ర్చించామ‌ని.. దీంతో మే-03 వ‌ర‌కు రాష్ట్రంలో ఎలాంటి స‌డ‌లింపు లేద‌న్నారు. కేంద్రం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింద‌ని.. తెలంగాణ‌లో మాత్రం ఎలాంటి స‌డ‌లింపులు ఉండ‌వ‌న్నారు సీఎం కేసీఆర్. స్థాన‌క ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కేంద్ర‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పింద‌న్నారు. ఇప్పటికే చేస్తున్న పనులకు మాత్రమే అనుమతిస్తామ‌ని.. కేంద్రం అధికారాలన్నీ మాకూ ఉన్నాయన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యంమ‌న్న కేసీఆర్.. మే -07వ‌రుకు రాష్ట్రంలో లాక్ డౌన్ పొడిగించామ‌న్నారు.