మే 7 తర్వాత కూడా ఫంక్షన్లకు అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు

మే 7 తర్వాత కూడా ఫంక్షన్లకు అనుమతి ఇచ్చే పరిస్థితి లేదు

హైద‌రాబాద్ : మే 7 తర్వాత కూడా ఫంక్షన్లకు అనుమతి ఇచ్చే పరిస్థితి లేదని తెలిపారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పై ఆదివారం రాత్రి ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం.. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తోందన్నారు. పండగలు, ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని .. మే 7 త‌ర్వాత కూడా ఫంక్ష‌న్ల‌కు అనుమ‌తి లేద‌న్నారు. ఎలాంటి మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నిత్యావసరాలు ఎప్పటిలానే అందుబాటులో ఉంటాయని తెలిపారు. లాక్‌ డౌన్ విషయంలో గతంలో ఉన్న నిబంధనలే మే 7వరకూ కొనసాగుతాయని.. తెలంగాణలో ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ లాక్‌ డౌన్ పొడిగింపుపై సర్వే చేశామని, పలు మీడియా సంస్థలు కూడా సర్వే చేశాయని సీఎం చెప్పారు. ప్రజలు మంచి సహకారం అందిస్తున్నారని చెప్పారు సీఎం కేసీఆర్.