యువకులు ముందుకొస్తనే దేశం బాగుపడ్తది:కేసీఆర్

యువకులు ముందుకొస్తనే దేశం బాగుపడ్తది:కేసీఆర్

కేంద్రం అసమర్థ విధానాలతో ఎంతో నష్టపోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం తీరుతో జీఎస్డీపీ వెనుకబడిందన్నారు. మహబూబాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. దేశ అభివృద్ధిపై యువకులు చర్చించాలన్నారు. యువకులు ముందుకు వస్తేనే  దేశం బాగుపడుతుందన్నారు.  కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  20 ఏండ్లు గడిచినా కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కలెక్టరేట్ ప్రారంభోత్సవం

అంతకు ముందు మహబూబాబాద్ లో  సీఎం కేసీఆర్ సమీకృత కలెక్టరేట్ ను, జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 

కాసేపట్లో  పాల్వంచలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్​ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడనున్నారు. కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్ఎస్​ పార్టీ ఆఫీస్​ను ప్రారంభిస్తారు.  మరో వైపు సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లాలో ప్రతిపక్ష నేతలను నిన్న రాత్రి నుంచి ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.