ఇంటి నుంచి ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

ఇంటి నుంచి ఓటు వేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి  ఢిల్లీలో  ఓటు వేశారు.   లోక్‌సభ ఎన్నికల కోసం ఇంటి నుంచి ఓటు వేశారు.  ఈ సారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.  85 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసేందుకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే వాళ్లు ఇంటి నుంచి  ఓటు వేశారు. 

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నాలుగు దశల పోలింగ్‌ పూర్తి కాగా..  మిగిలిన మూడు దశల ఓటింగ్‌కు సంబంధించిన ప్రచారం జోరుగా సాగుతోంది. మే 25న ఢిల్లీలో ఆరో దశ పోలింగ్‌ జరగనుంది.  ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీలోని ఎన్నికల సంఘం 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు వేసే విధానాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా.. మే 17న మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, ఆయన భార్య గురుశరణ్ కౌర్ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానానికి తమ ఇంటి నుంచే ఓటు వేశారు.