టెన్త్ మోడల్ పేపర్లలో గందరగోళం

టెన్త్ మోడల్ పేపర్లలో గందరగోళం

తీసేసిన సిలబస్ నుంచి క్వశ్చన్లు
ఆందోళనలో టీచర్లు, స్టూడెంట్స్

హైదరాబాద్, వెలుగు: రెండ్రోజుల కింద ఎస్​సీఈఆర్టీ వెబ్ సైట్​లో పెట్టిన టెన్త్ మోడల్ పేపర్లలో.. తొలగించిన సిలబస్​ లోంచి క్వశ్చన్లు ఇవ్వడంతో స్టూడెంట్లు, టీచర్లలో అయోమయం నెలకొన్నది. కరోనా ఎఫెక్టుతో ఈ ఏడాది టెన్త్ లో 30%  సిలబస్​ తగ్గించిన సర్కారు.. 70% సిలబస్​ నుంచే ఎగ్జామ్స్​లో క్వశ్చన్లు వస్తాయని చెప్పింది. పేపర్లను కూడా 11 నుంచి ఆరుకు కుదించింది. 80 మార్కులతో కూడిన పేపర్​ ఉంటుందని పేర్కొంది. విద్యాశాఖ అధికారులు శనివారం టెన్త్ మోడల్ పేపర్లను ఎస్​సీఈఆర్టీ వెబ్ సైట్​లో పెట్టారు. ఈ పేపర్లలో తొలగించిన సిలబస్ నుంచి ప్రశ్నలు రావడం చూసి టీచర్లు ఆందోళన చెందుతున్నారు. తెలుగు సబ్జెక్టులో పద్యభాగం, గద్యభాగం, ఉపవాచకం ఉండగా.. వీటిలో కొన్ని చాప్టర్లను సిలబస్​ నుంచి తగ్గించారు. మోడల్ పేపర్​లో మాత్రం తీసేసిన పాఠాల్లోంచే క్వశ్చన్లను పెట్టారు. మ్యాథ్స్​ సబ్జెక్టులోనూ ఇలాంటి అయోమయమే నెలకొన్నది. పార్ట్​–ఎ లో 15, పార్ట్–బి లో 4,15,19 క్వశ్చన్లు తీసేసిన సిలబస్​ నుంచే పెట్టారు. అన్ని సబ్జెక్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని టీచర్లు చెప్తున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.