మునుగోడు అభ్యర్థిని ఏఐసీసీ ఫైనల్ చేస్తుంది

మునుగోడు అభ్యర్థిని ఏఐసీసీ ఫైనల్ చేస్తుంది

మునుగోడు అభ్యర్థి విషయంలో పీసీసీ ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపామని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అభ్యర్థిని ఏఐసీసీ ఫైనల్ చేస్తుందని స్పష్టం చేసిన ఆయన.. అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. గులాం నబీ ఆజాద్ కు పార్టీతో 50ఏళ్ళ అనుభవం ఉందని..కాంగ్రెస్ నుండి అత్యధిక లాభం పొందిన వ్యక్తి ఆయన అని చెప్పారు. రాజ్యసభ సభ్యత్వాన్ని పొడిగించలేదన్న అసంతృప్తితోనే ఆజాద్ మాట్లాడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. గాంధీ కుటుంబంపై ఆయన చేస్తున్న వ్యాఖలను తీవ్రంగా ఖండించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ, ఈడీ ఎంక్వయిరీ వేయాలి
మతకల్లోలాలను రెచ్చగొట్టడానికే రాజాసింగ్ మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపి పార్టీ రాజాసింగ్ ను ఆయుధంగా వాడుతుందని ఆరోపించారు. రాజాసింగ్ శాసనసభ సభ్యత్వాన్ని స్పీకర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఆయనను శిక్షించాలన్నారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ, ఈడీ ఎంక్వైరీ వేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. 8 ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బిజెపి ఏం చేస్తుందని ప్రశ్నించారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర సర్కార్ లు  విఫలమయ్యాయని విమర్శించారు.