హెల్త్ వర్కర్స్‌‌‌‌కు  4 నెలలుగా జీతాల్లేవ్

హెల్త్ వర్కర్స్‌‌‌‌కు  4 నెలలుగా జీతాల్లేవ్
  •     ఏప్రిల్​లో రెన్యువల్ చేయని ఆఫీసర్లు
  •     స్టేట్​ వైడ్ 1,527 మంది ఎదురు చూపులు
  •     ఆర్థిక ఇబ్బందుల్లో వారి కుటుంబాలు

యాదాద్రి, వెలుగు: హెల్త్​ డిపార్ట్​మెంట్​లో 2003లో రిక్రూట్ అయిన1,527 మంది కాంట్రాక్ట్ హెల్త్​వర్కర్స్​కు నాలుగు నెలలుగా జీతాలు రావట్లేదు. ఆఫీసర్లు రెన్యువల్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని హెల్త్​వర్కర్స్ అంటున్నారు. ప్రతి ఏడాది లాగే 2021–22 ఫైనాన్షియల్ ఇయర్​లోనూ రెన్యువల్​చేయాల్సి ఉంది. కానీ రకరకాల కారణాలు చెబుతూ ఆఫీసర్లు వాయిదా వేస్తున్నారు. ఫైనాస్షియల్ డిపార్ట్​మెంట్ నుంచి క్లియరెన్స్​ రాలేదని ఒకసారి, సీఎంవోలో ఫైలు పెండింగ్​లో ఉందని మరోసారి, డ్యూటీ చేస్తున్న హెల్త్​ వర్కర్స్ అందరి డేటా కావాలని ఇంకోసారి చెబుతూ కాలయాపన చేస్తున్నారని హెల్త్​ వర్కర్స్​అంటున్నారు. ఆఫీసర్ల తీరుతో తమ కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

ఏటా చేయాల్సిందే.. 

డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్​సెలక్షన్​కమిటీ–2003 ద్వారా స్టేట్​వైడ్ హెల్త్​అసిస్టెంట్లు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ శాంక్షన్ పోస్టులను కాంట్రాక్ట్ పద్దతిలో రిక్రూట్ చేశారు. జీవో నెంబర్–16 ప్రకారం వారి సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉన్నా.. వివిధ కారణాల వల్ల పక్కనపెట్టారు.18 ఏండ్లుగా ఏటా రెగ్యులర్​గా  రెన్యువల్​చేస్తూ వస్తున్నారు. రెన్యువల్​చేస్తేనే డిస్ట్రిక్ ట్రెజరీ నుంచి వీరికి జీతాలు విడుదల అవుతాయి. కానీ ఈసారి ఏప్రిల్​లో రెన్యువల్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1,527 మంది కాంట్రాక్ట్ హెల్త్​ వర్కర్స్ జీతాలు ఆగిపోయాయి. ఇందులో హెల్త్ అసిస్టెంట్లు 1,139, ఫార్మాసిస్ట్189, లాబ్ టెక్నిషియన్లు 199 మంది ఉన్నారు. కరోనా ఫస్ట్, సెకండ్​వేవ్​తీవ్రంగా ఉన్న సమయంలో పీహెచ్​సీల్లో వీరి సేవలు కీలకంగా మారాయి. టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వీరే ముందుండి పనిచేశారు. రెన్యువల్​ చేయకపోవడంతో జీతాలు రాక ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు. 2021–-22 రెన్యువల్​కు సంబంధించి ఉత్తర్వులు వెంటనే జారీచేసి జీతాలు అందేలా చూడాలని హెల్త్​వర్కర్స్ కోరుతున్నారు.