మల్కాజ్ గిరి ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనా టెస్ట్ లు..42మందికి సోకిన వైరస్

మల్కాజ్ గిరి ప్రభుత్వ హాస్పిటల్ లో కరోనా టెస్ట్ లు..42మందికి సోకిన వైరస్

మేడ్చల్ జిల్లా మల్కాజ్ గిరి ప్రభుత్వ హాస్పిటల్ లో 180 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 42 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు హాస్పిటల్​ సూపరింటెండెంట్​ రాజు తెలిపారు. ఆస్పత్రిలో కరోనా టెస్ట్ లు నిర్విరామంగా కొనసాగుతున్నాయని, పరీక్షల కోసం వచ్చిన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. టెస్ట్ ల్లో కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ అయితే వారు ఇంటి దగ్గరే ఉండాలని సూచించామన్నారు. కరోనా సోకిన వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్ రూమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. వైరస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మాస్క్ ధరిస్తూ పలు జాగ్రత్తలు పాటించాలని మల్కాజ్ గిరి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.