2027 వరల్డ్ కప్ టికెట్లకు మామూలు క్రేజ్ కాదు.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్స్!

2027 వరల్డ్ కప్ టికెట్లకు మామూలు క్రేజ్ కాదు.. 12 రోజుల్లో 1.5 కోట్ల అప్లికేషన్స్!

ICC World Cup 2027: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ 2027 (ICC ODI World Cup 2027) టికెట్ల బ్యాలెట్ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. బ్యాలెట్ విండో ప్రారంభమైన కేవలం 12 రోజుల్లోనే ఊహించని రీతిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రపంచ వ్యాప్తంగా 142 దేశాల నుంచి దాదాపు 44.23 లక్షల మంది అభిమానులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, మొత్తం 1,50,83,752 (కోటిన్నరకు పైగా) టికెట్ దరఖాస్తులు నమోదైనట్లు ఐసీసీ తెలియజేసింది. గత వారం రోజుల్లో కేవలం ఒక మిలియన్ (10 లక్షలు)గా ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొద్ది రోజుల్లోనే కోటిన్నర దాటడం ఈ మెగా టోర్నీపై ఉన్న క్రేజ్‌ ఎంటో అర్థం అవుతుంది. 

24 ఏళ్ల విరామం తర్వాత ఆఫ్రికాలో ఆతిథ్యం:

ఈ 14వ ఎడిషన్ వన్డే ప్రపంచకప్‌ను సరికొత్త ఫార్మాట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. దాదాపు 24 సంవత్సరాల విరామం తర్వాత క్రికెట్ ప్రపంచకప్ మళ్లీ ఆఫ్రికా ఖండానికి తిరిగి రావడం, ఐసీసీ చేపట్టిన గ్లోబల్ ప్రచార కార్యక్రమాలు ఈ స్థాయిలో స్పందన రావడానికి ప్రధాన కారణమని ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక క్రికెట్ టోర్నీ 2027 అక్టోబర్ 2న నమీబియాలోని విండ్‌హోక్ వేదికగా ఘనంగా స్టార్ట్ అయింది. 

నవంబర్ 21 వరకు ఛాన్స్: 

* ఉచిత రిజిస్ట్రేషన్: ఈ టికెట్ బ్యాలెట్ ప్రక్రియలో పాల్గొనడం పూర్తిగా ఉచితం. రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

* చివరి తేదీ: ఈ బ్యాలెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2026 నవంబర్ 21 రాత్రి 11:59 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. సరిగ్గా అదే రోజు నుంచి జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ మైదానంలో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌కి సరిగ్గా ఒక సంవత్సరం సమయం మిగిలి ఉంటుంది.

* లాటరీ విధానం: ఇది ముందు వచ్చిన వారికి ప్రాధాన్యత ప్రాతిపదికన కాకుండా, పూర్తిగా పారదర్శకంగా ఉండే లాటరీ (Lottery System) విధానంలో జరుగుతుంది. విండో తెరిచి ఉన్నంత వరకు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉంటాయి.

* నోటిఫికేషన్: డిమాండ్ ఎక్కువగా ఉన్న మ్యాచ్‌లకు లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేసి, వారి ఈమెయిల్ ఐడీకి టికెట్లు కొనుగోలు చేసే లింక్‌ను ఐసీసీ పంపుతుంది.

►ALSO READ | కోహ్లీ నెక్స్ట్ లెవల్ ప్లాన్.. ఇండియా నుంచి గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్స్: విరాట్ బిజినెస్ ప్లాన్‌లో వన్8, అజిలిటాస్