శ్రీనివాసన్ యూ టర్న్​..రైనాకు అండగా ఉంటాం

శ్రీనివాసన్ యూ టర్న్​..రైనాకు అండగా ఉంటాం

ముంబై: ఐపీఎల్ నుంచి వైదొలిగి తానేం కోల్పోయాడో సురేశ్‌‌ రైనా చాలా త్వరగా తెలుసుకుంటాడని వ్యాఖ్యానించిన చెన్నై సూపర్‌‌ కింగ్స్‌‌  ఫ్రాంచైజీ ఓనర్​ ఎన్​. శ్రీనివాసన్​..యూ టర్న్​ తీసుకున్నాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నాడు. సీఎస్​కేలో రైనా కంట్రిబ్యూషన్​కు వెల కట్టలేమన్నాడు. ‘కొన్నేళ్లుగా రైనా సీఎస్​కేకు అందిస్తున్న కంట్రిబ్యూషన్​ చాలా గొప్పది. దానిని ఎప్పటికీ మరువలేం.కొంత మంది నా వ్యాఖ్యలను మిస్ ​అండర్​స్టాండ్​ చేసుకున్నారు. ఈ టైమ్​లో రైనా పరిస్థితిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ కష్టకాలంలో అతనికి మా సపోర్ట్​ఉంటుంది’ అని శ్రీని వెల్లడించాడు. 2008 నుంచి చెన్నైకి ఆడుతున్న రైనా.. 193 మ్యాచ్​ల్లో 5368 రన్స్​ చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 38 హాఫ్​ సెంచరీలు ఉన్నాయి.

రైనా ప్లేస్​లో రుతురాజ్​

చెన్నై మిడిలార్డర్​కు అత్యంత కీలకమైన రైనా ప్లేస్​ను యంగ్​స్టర్​ రుతురాజ్​తో భర్తీ చేయాలని సీఎస్​కే మేనేజ్​మెంట్​ భావిస్తోంది. చెన్నైలో ఏర్పాటు చేసిన మూడు రోజుల క్యాంప్​లో రుతురాజ్​ బ్యాటింగ్​కు ధోనీ ఫిదా అయ్యాడు. ఎక్కువ చాన్స్​లు ఇస్తే మరింత రాటుదేలుతాడని మహీ భావిస్తున్నట్లు సమాచారం. కరోనాతో పోరాడుతున్న రుతురాజ్ఇ న్​టైమ్​లో ​ అందుబాటులోకి రాకుంటే ఇంగ్లండ్​ ఆల్​రౌండర్​ సామ్​ కరన్​ను ఆడించే చాన్స్​ ఉంది. మరోవైపు  ఆఫ్​ స్పిన్నర్​ హర్భజన్​ కూడా రైనా బాటలో నడుస్తున్నట్లు తెలుస్తున్నది. షెడ్యూల్​ ప్రకారం మంగళవారం యూఏఈకి బయలుదేరాల్సిన భజ్జీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఇక ఆసీస్​ పేసర్​ హాజిల్​వుడ్​ కూడా పాజిటివ్​ కేసులపై ఆరా తీస్తున్నాడు. కానీ అతను యూఏఈ వచ్చే చాన్స్​లు చాలా ఉన్నాయి.

ఫస్ట్​ లెగ్​ దుబాయ్​లోనే..

పాజిటివ్​ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. ఫస్ట్​ లెగ్​ మ్యాచ్​లన్నీ దుబాయ్​లోనే నిర్వహించాలని ఐపీఎల్​ పాలకులు భావిస్తున్నారు. లీగ్​లోని ఎనిమిది టీమ్​ల్లో ఆరు దుబాయ్​లోనే ఉన్నాయి. అబుదాబి బేస్​గా ఉన్న ముంబై, కోల్​కతాను కూడా దుబాయ్‌‌ రప్పించి లీగ్​లో తొలి 20 మ్యాచ్‌‌లను అక్కడే నిర్వహించాలని ప్రస్తుతం  అనుకుంటున్నారు.

బాల్కనీ లేకపోవడం వల్లే..

వ్యక్తిగత కారణాలతో రైనా టోర్నీ నుంచి వైదొలిగినట్లు వార్తలు వచ్చినా.. అసలు విషయం మాత్రం వేరేగా ఉంది. దుబాయ్​లోని తాజ్ హోటల్​లో తనకు కేటాయించిన సూట్​లో బాల్కనీ లేకపోవడం రైనాకు నచ్చలేదట. టీమ్​లో పాజిటివ్​ కేసులు ఎక్కువ కావడంతో అటుఇటు తిరగడానికి సరైన స్పేస్​ కావాలని బ్యాట్స్​మన్​ కోరుకున్నాడని, అది లేకపోవడంతో ఆగ్రహాంతో టోర్నీ నుంచి వైదొలిగాడని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. అయితే  ఈ విషయంపై శ్రీని వివరణ ఇచ్చాడు. ‘సీఎస్​కేకు ఆడుతున్న కుర్రాళ్లందరూ మా ఫ్యామిలీ వంటివారు. పదేళ్లుగా వాళ్లు మాతోనే కలిసున్నారు. టోర్నీకి క్రికెటర్లు చాలా ప్రధానం. కానీ నేను చెప్పిన మాటలను నెగెటివ్​గా తీసుకున్నారు’ అని బీసీసీఐ మాజీ బాస్​ వెల్లడించాడు.