ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకలకు ఫుల్ సెక్యూరిటీ

ఢిల్లీలో రిపబ్లిక్ వేడుకలకు ఫుల్ సెక్యూరిటీ

ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఢిల్లీ సీపీ రాకేశ్ అస్థానా. గణతంత్ర వేడుకల సందర్భంగా సెక్యూరిటీ ఏర్పాట్లపై ఆయన మాట్లాడారు. ఢిల్లీని ఎప్పుడూ తీవ్రవాదులు టార్గెట్ చేస్తుంటారన్నారు. అందుకోసమే. గత రెండు నెలలుగా తీవ్రవాదులపై గట్టిగా నిఘా పెట్టామన్నారు. తీవ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ఏడాది కూడా అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు.

డీసీపీలు, ఏసీపీలు, ఢిల్లీ పోలీస్ కమాండోలు, సీఏపీఎఫ్ కమాండోలు సహా 20,000 మంది బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ సన్నాహాలపై  ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు ఢిల్లీ సీపీ రాకేష్ అస్థానా. గగనతల భద్రత కోసం కౌంటర్ డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. , గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 65 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో సహా 27,000 మంది పోలీసులను భద్రతా ఏర్పాట్ల కోసం మోహరించామన్నారు. 

మరోవైపు రిపబ్లిక్ డే వేడుకలపై మేజర్ జనరల్ అలోక్ కక్కర్ కూడా మాట్లాడారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో భారత సాయుధ బలగాలకు చెందిన 8 కంటెంజెంట్లు ఉంటాయన్నారు. ఇందులో 6 ఆర్మీ కంటెంజెంట్లు, వైమానిక దళం, నేవీ నుండి ఒక్కొక్కటి ఉంటాయి. పారాచూట్ రెజిమెంట్ బృందం సరికొత్త టావర్ రైఫిల్స్‌తో  యూనిఫాంను ధరిస్తుందని మేజర్ జనరల్ అలోక్ కక్కర్ పేర్కొన్నారు.