నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్

నిరుద్యోగులు, రైతుల సమస్యలు.. మోడీకి కనిపించడం లేదు: రాహుల్

మోదీ దేశానికి ప్రధానిలా వ్యవహరించడం లేదని ఫైరయ్యారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. బీజేపీ సర్కార్ కు పేదలు, నిరుద్యోగులు, రైతుల సమస్యలు కనిపించడం లేదని మండిపడ్డారు.  మే 17వ తేదీ శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలో జరిగిన బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. కొంతమంది వ్యాపారులకు మేలు చేయడానికే..  మోడీ ప్రధాని అయ్యారని విమర్శించారు. మోదీ తన ఫ్రెండ్స్ కు చేసిన రుణమాఫీతో.. రైతులకు 22సార్లు రుణ మాఫీ చేయొచ్చని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తే మహిళలు, రైతులకు అండగా ఉంటుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

అనంతరం ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. దేశంలో నియంతృత్వ పాలనను అంతం చేయడమే కూటమి లక్ష్యమన్నారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. పదేళ్లగా ప్రధాని మోదీ.. రైతుకూలీలు, పేదలు, మహిళల సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజల మధ్య విధ్వేషాలు పెంచే బీజేపీని ఓడించడానికి.. ప్రతీ ఒక్కరు కలిసి రావాలన్నారు. యూపీలో కాంగ్రెస్, ఎస్పీ కార్యకర్తలు కూటమి గెలుపు కోసం సైనికుల్లా పని చేస్తున్నారని కొనియాడారు. రాయ్ బరేలీలో 5లక్షల ఓట్ల మెజార్టీతో రాహుల్ ను గెలిపించాలన్నారు ప్రియాంక గాంధీ. 

రాయ్ బరేలీతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. 20ఏళ్లుగా ప్రజాసేవ చేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇన్నాళ్లు తనను ఆదరించినట్లే.. రాహుల్, ప్రియాంక గాంధీలకు అండగా ఉండాలన్నారు. రాయ్ బరేలీ, అమేథీ ప్రజలకు కాంగ్రెస్ ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు సోనియా గాంధీ.