- ఉప్పల్లో కాపాడిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 7 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కు స్థలాలను హైడ్రా శనివారం కాపాడింది. 1980లో బాబానగర్ కాలనీ లేఅవుట్‌లో 183 ప్లాట్లతో 3 వేల గజాలు పార్కుకు కేటాయించారు. ఆ తర్వాత ప్లాట్ల సంఖ్య 189కి పెరిగి పార్కు స్థలాన్ని 500 గజాల చొప్పున 6 ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. దీనిపై స్థానికులు హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.
3 వేల గజాలు పార్కుకు కేటాయించినట్లు నిర్ధారించుకున్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని నివాసాలు రాగా మిగిలిన 2 వేల గజాల స్థలానికి ఫెన్సింగ్ వేసి, పార్కు స్థలంగా బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే నాచారం గ్రామంలోని కార్తికేయ నగర్లో 3 ఓపెన్ ప్లేస్లతో పాటు 5 వేల గజాల పార్కు స్థలాలను కూడా హైడ్రా కాపాడింది. వీటి మొత్తం విలువ రూ.85 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
