- నిందితుడు అరెస్ట్
జూబ్లీహిల్స్, వెలుగు: హాస్టల్లో స్నానం చేస్తుండగా యువతి వీడియో వీసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధురానగర్ లో ఓ వ్యక్తి ప్రైవేటు లేడీస్ హాస్టల్నిర్వహిస్తున్నాడు. యజమాని బంధువైన పవన్ కల్యాణ్ ఇటీవల పనుల కోసం వచ్చి, శనివారం బాత్రూమ్లోస్నానం చేస్తున్న ఓ యువతి వీడియోను కిటికీ వద్ద నుంచి ఫోన్లో రికార్డ్చేశాడు. అనుమానాస్పద కదలికలు గమనించిన బాధితురాలు, ఇతర మహిళలతో కలిసి బయటికి వచ్చి పవన్ కల్యాణ్‌ను గుర్తించారు.
అతని మొబైల్ ఫోన్ చూపించాలని కోరితే నిరాకరించాడు. హాస్టల్ యజమాని కూడా సహకరించకపోవడంతో బాధిత యువతి తన స్నేహితుల సాయంతో మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
