బెంగాల్‌‌కు తదుపరి సీఎం ఆయనే!

బెంగాల్‌‌కు తదుపరి సీఎం ఆయనే!
కోల్‌‌కతా: ఈ ఏడాది పశ్చిమ బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే అన్ని పార్టీలు దీనికి సంబంధించిన కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్ సీఎం అవుతారని బెంగాల్ బీజేపీ యువ మోర్చా ప్రెసిడెంట్ సౌమిత్ర ఖాన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. పార్టీ మీటింగ్‌‌లో దిలీప్ ఘోష్ ఎదుటే సౌమిత్ర ఖాన్‌‌పై బెంగాల్ బీజేపీ ఇన్‌‌చార్జ్ కైలాష్ విజయ్‌‌‌వర్గియా ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. సీఎం ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని.. ఇలాంటి విషయాల్లో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారని తెలుస్తోంది. ‘దిలీప్ ఘోష్ నిఖార్సయిన నేత. ఆయనే తదుపరి సీఎం అని నేను నమ్ముతున్నా’ అని ఓ సభలో సౌమిత్ర ఖాన్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉందని తెలుస్తోంది. "Dilip Ghosh is the original leader…I firmly belive Dilip Ghosh will be the CM" This comment by BJP MP Saumitra Khan lands him in trouble with party leadership. pic.twitter.com/h2xC8zfDjD — Indrajit Kundu | ইন্দ্রজিৎ – কলকাতা (@iindrojit) January 18, 2021