దినేశ్ కార్తీక్ చెత్త రికార్డ్

దినేశ్ కార్తీక్ చెత్త రికార్డ్

టీమిండియా కీపర్, బ్యాట్స్‌ మెన్  దినేశ్ కార్తీక్ ఊహించని చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళనాడు జట్టుకు కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్న కార్తీక్ ఉత్తర్‌ ప్రదేశ్‌ తో జరిగిన మ్యాచ్‌ లో హిట్‌ వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. నాలుగు సిక్సులు, ఐదు ఫోర్లతో 41 బాల్స్ లో 61 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డు కార్తీక్ ఖాతాలో చేరింది. గతంలో లిస్ట్-ఏ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ లోనూ కార్తీక్ హిట్ వికెట్‌ రూపంలో ఔట్ అయ్యాడు. దీంతో లిస్ట్-ఏ, ఫస్ట్ క్లాస్, టీ-20.. మూడు ఫార్మాట్లలో హిట్ వికెట్‌ అయిన ఫస్ట్ బ్యాట్స్‌ మెన్‌ గా అతను ఊహించని రికార్డు సాధించాడు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీన్ని తలబాదుకుంటున్నట్లు ఉన్న ఎమోజీ పెట్టి దినేశ్ కార్తీక్ రీట్వీట్ చేశాడు.

ఐసీసీ ప్రపంచకప్ తర్వాత టీం ఇండియాలో చోటు దక్కించుకోలేకపోయిన..కొన్ని మ్యాచుల్లో రాణించిన దినేష్..ఈ మ్యాచ్ లో ఘోరంగా విఫలమయ్యాడు.