కరోనా చికిత్సకు మందుల కొరత రానీయెద్దు : ఈటల

కరోనా చికిత్సకు మందుల కొరత రానీయెద్దు : ఈటల

రాష్ట్రంలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఆస్పత్రుల్లో మందుల కొరత రాకుండా చూడాలన్నారు మంత్రి ఈటల రాజేందర్. అంతేకాదు మెడిసిన్స్ ను బ్లాక్ మార్కెట్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మందుల కొరతపై వస్తున్న వార్తల క్రమంలో ఆయన   తన కార్యాలయంలో ఇవాళ(శనివారం) సమీక్ష నిర్వహించారు. ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులు, అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరోనా చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు. కరోనా చికిత్సలో భాగంగా ఉపయోగించే అజిత్రోమైసిన్‌, డాక్సీసైక్లిన్‌, డాక్సామెతాసోన్‌, మిథైల్‌ ప్రెడ్నిసోలొన్‌ మందులను వీలైనంత తొందరగా సరఫరా చేయాలని సూచించారు. విటమిన్‌-డీ, సీ, మల్టీవిటమిన్‌, జింక్ వంటి ఔషధాలను మందుల షాపులు, ఆస్పత్రుల్లో సరిపడినన్ని ఉంచాలని చెప్పారు. అలాగే ఎక్కడా మందుల కొరత రాకుండా చూసుకోవాలన్నారు. బ్లాక్ మార్కెట్లో మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి ఈటల.