Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

Suriya Kanguva: సూర్య Vs బాబీ డియోల్..పది వేల మందితో కంగువ బిగ్గెస్ట్ వార్ సీన్ షూటింగ్

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ సినిమాలతో ఆకట్టుకునే సూర్య (Suriya).. ప్రస్తుతం కంగువ (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. శివ(Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్‌‌‌‌‌‌‌‌ డ్రామాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌‌‌‌‌‌‌‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచాయి. 

తాజాగా కంగువ నుంచి క్రేజీ అప్డేట్ రివీల్ అయింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సూర్య Vs బాబీ డియోల్ అన్నట్టుగా వార్ సీన్స్ ఉండబోతున్నాయట. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లోనే తెలిసిపోయింది. కానీ, ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే..సూర్య మరియు బాబీ డియోల్ మధ్య తెరకెక్కించే భీభత్సమైన వార్ సీన్ ను ఏకంగా 10 వేల మందితో తెరెకెక్కించినట్లు సమాచారం.

అలాగే ఈ  సినిమా సబ్జెక్ట్, థీమ్ ప్రకారం ఆ యుద్ధ సన్నివేశానికి సమగ్రమైన న్యాయం చేయడానికి..ప్రొడక్షన్ హౌస్ ది స్టూడియో గ్రీన్, డైరెక్టర్ శివ, మొత్తం టీమ్ అంతా చాలా రోజులు శ్రమించిందని ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది.  ఈ సినిమాలో సూర్య, బాబీ డియోల్, మరో పది వేల మందితో అతిపెద్ద వార్ సీక్వెన్స్ ఉండనుంది" అని కంగువ వర్గాలు వెల్లడించినట్లు (ఇండియా టుడే రిపోర్టు) తెలిపింది. 

అంతేకాకుండా..కళ్లు చెదిరే సినిమాటిక్ ఎక్స్‌పీరియర్ష్ ను పలు భాషల ఆడియెన్స్ కు అందించాలన్న ఉద్దేశంతో ఈ యుద్ధ సన్నివేశంలోని ప్రతి యాక్షన్, స్టంట్స్, విజువలైజేషన్ ను ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పర్యవేక్షణలో చేసినట్లు మరో కథనం వినిపిస్తోంది. ఇక ఈ వార్ సీన్ ఇండియా లెవల్లో ఇప్పటివరకు తెరకెక్కిన అద్భుతమైన వార్ సీన్స్ ని బీట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ న్యూస్ తెలుసుకున్న సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కంగువ టీజర్ ను ట్రెండ్ చేస్తున్నారు.  

టీజర్ విషయానికి వస్తే.. 

ఒక్కమాటలో టీజర్ గురించి చెప్పాలంటే..సూర్య నట విశ్వరూపం చూపించాడు. అగ్నితో సెగలు రేపే అటవిక యోధుడిగా సూర్య వైల్డ్ లుక్ ఆకట్టుకుంటోంది. డైలాగ్స్ లేకుండా కట్ చేసిన టీజర్ లో విజువల్స్, నటి నటుల మైండ్ బ్లాంక్ చేసే లుక్స్ ,సూర్య, బాబీ డియోల్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు గూస్బంప్స్ అని చెప్పాలి. మరోసారి సూర్య తనదైన విభిన్నమైన శైలితో నట విశ్వరూపం చూపించాడు. 

ఎంతో క్రూరంగా కనిపించే శవాల గుట్ట, భీకరమైన యుద్ధం, టీజర్ ఎండింగ్లో పెరుమర్చి అనే సూర్య వాయిస్..ఇలా ప్రతిదీ నెక్స్ట్ లెవల్ అనే విధంగా ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ బాక్గ్రౌండ్ స్కోర్ బీభత్సం అనేలా ఉంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. 

కంగువ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దిషా పఠాని హీరోయిన్గా నటిస్తోంది. 3Dలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు..రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పది భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా..త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.