
మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించబోయే సంగీతంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ లెవల్లో అంచనాలు పెట్టేసుకున్నారు.
తాజాగా దేవర నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఎలాంటి లిరిక్స్ లేకుండా మొత్తం బీజీమ్తో వణికించేలా ఉన్న ఫియర్ సాంగ్ ప్రోమో చూస్తుంటే..మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడనిపిస్తోంది. ఇక ఇండియన్ సినిమాలో మైల్‌స్టోన్ మార్క్ దేవర క్రియేట్ చేస్తుందనే విషయాన్ని పదే చెబుతూ వస్తున్నారు మేకర్స్. అచ్చం అలానే ఉన్న ఈ 14 సెకన్ల నిడివి గల వీడియోలో..ఎన్టీఆర్ సముద్రంలో బోట్ పై అలా వస్తుంటే రెండు కళ్ళు చాలవన్నట్లుగా స్టన్నింగ్ లుక్స్ అదిరిపోయాయి. ఇక అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ సౌండ్ తోనే బీట్ దద్దరిల్లింది. ఇక పూర్తి సాంగ్ ఎలా వుండబోతుందనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో పెరిగింది.
నిజానికి దేవరకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు అని తెలిసినప్పటినుండి ఈ సినిమా రేంజ్ మారిపోయింది. కారణం.. అనిరుధ్ నుండి వచ్చిన గత చిత్రాలే. ఆయన మ్యూజిక్ అందించిన విక్రమ్, లియో, జైలర్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అందుకే.. దేవర కోసం అనిరుధ్ అందించబోయే మ్యూజిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో భాగంగానే.. తాజాగా దేవర నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అప్డేట్ వచ్చింది. మే 19 ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఒకరోజు ముందు ఈ పాట ఆన్లైన్ లో విడుదల కానుంది.