ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం: ఈసీ

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ నిషేధం: ఈసీ

ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో భారత ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. హర్యానా, మహారాష్ట్ర సహా, ఉప ఎన్నికలు జరుగనున్న17 రాష్ట్రాల్లో ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. EC అధికార ప్రతినిధి ఎస్.శరణ్  దీనికి సంబంధించిన వివరాలను ట్వీట్ చేశారు. 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం వర్తిస్తుందన్నారు. పోలింగ్ గడువు ముగిసే వరకు ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, పోల్ సర్వేలు కూడా ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయకుండా నిషేధించామని శరణ్ తెలిపారు.