ఎన్సీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటా : ఫరూక్

ఎన్సీ చీఫ్ పదవి నుంచి తప్పుకుంటా : ఫరూక్

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ ప్రెసిడెంట్​ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఆ పదవిలో కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన టైమ్ వచ్చిందని వెల్లడించారు. "ఇకపై నేను పార్టీ ప్రెసిడెంట్​ పదవికి పోటీ చేయను. డిసెంబర్ 5న ఆ పదవికి ఎన్నికలు జరుగుతాయి. కొత్త వ్యక్తి బాధ్యతలు స్వీకరించాల్సిన టైమొచ్చింది. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నిక జరుగుతుంది.

పార్టీ నుంచి ఎవరైనా పోటీ చేయవచ్చు." అని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. అబ్దుల్లా 1983లో తొలిసారి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్​ అయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ ప్రెసిడెంట్ బాధ్యతల నుంచి వైదొలుగుతుండటంతో.. పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఒమర్ అబ్దుల్లానే కొత్త చీఫ్‌‌‌‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.