మనిషింత ఎత్తులో నిలబడ్డ కింగ్ కోబ్రా.. వీడియో వైరల్

మనిషింత ఎత్తులో నిలబడ్డ కింగ్ కోబ్రా.. వీడియో వైరల్

భూమిపై ఉన్న ప్రాణాంతకమైన, భయంకరమైన సరీసృపాలలో పాములు ఒకటి. వాటికున్న ప్రత్యేకమైన, అద్భుతమైన సామర్ధ్యాలతో కొన్ని సార్లు మరింత భయానకంగా కనిపిస్తాయి. అలాంటి ఓ ఆసక్తికరమైన వీడియోనే ఇటీవల ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దాంతో పాటు ఈ నాగుపాము లేచి నిలబడగలదు.. ఎత్తైన మనిషిని కూడా చూడగలదు అని రాసుకొచ్చారు. ఈ వీడియోలో ఒక పెద్ద కింగ్ కోబ్రా నిటారుగా నిలబడి ఉంది.  మట్టి నేలపై నిల్చొని, తల పైకెత్తి చూస్తూ అత్యంత భయానకంగా కనిపిస్తోంది. నెటిజన్లను అత్యంత ఆకట్టుకుంటున్న ఈ వీడియోకు ఇప్పటివరకూ1,50,000 కంటే ఎక్కువ వ్యూస్ రాగా.. చాలా కామెంట్లు కూడా వచ్చాయి. ప్రపంచంలోని అత్యంత విషపూరిత పాములలో కింగ్ కోబ్రా ఒకటి. ఇది 10 నుండి 12 అడుగుల పొడవు, 20 పౌండ్ల (9 కిలోలు) వరకు బరువు ఉంటుంది. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం అవి "లేచి నిలబడగలవు". ఎత్తైన వ్యక్తులను కూడా చూడగలవు. దీని ఒక్క కాటులో విడుదలయ్యే న్యూరోటాక్సిన్ తో 20 మందిని చంపొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి.