తక్కువ ఇస్తరు..ఎక్కువ కొట్టేస్తరు

తక్కువ ఇస్తరు..ఎక్కువ కొట్టేస్తరు

లింక్స్‌‌ క్లిక్, స్క్రీన్ షాట్స్‌‌ అప్‌‌లోడ్ చేయమంటరు
టార్గెట్‌‌ రీచ్‌‌ అయిన వెంటనే  డిసెబుల్ చేస్తరు
ఇలా సూపర్‌‌‌‌ లైక్, న్యూవర్క్స్‌‌ యాప్స్​మోసాలు  
సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితుల కంప్లయింట్లు 

“ కూకట్​పల్లికి చెందిన అశోక్ మిశ్రా టెలీ కాలర్‌‌.‌‌ అతని సెల్​ఫోన్​కు ఫ్రెండ్​సూపర్ లైక్ యాప్‌‌ లింక్‌‌ మెసేజ్​ పంపించాడు. వెంటనే ఓపెన్​ చేసి మెంబర్‌‌‌‌గా జాయిన్‌‌ అయి ముందుగా రూ.1,000 పే చేశాడు. 30 ఆర్డర్స్‌‌ క్లిక్‌‌ చేయమని యాప్​ నిర్వాహకులు చెప్పడంతో అలాగే చేశాడు. నెక్ట్స్‌‌ డే అతనికి రూ.250 , ఇలా వారం రోజుల్లో రూ.5,000 వేలు వచ్చినట్టు చూపించింది.  విత్‌‌ డ్రా చేసుకునేందుకు ట్రై చేయగా అమౌంట్‌‌ రాలేదు. యాప్​ నిర్వాహకులను కాంటాక్ట్ ​అవగా మళ్లీ డిపాజిట్ చేయమని చెప్పి మెంబర్‌‌‌‌ షిప్‌‌ డిసెబుల్‌‌ చేశారు.’’

‘‘ అమీర్‌‌‌‌పేట్‌‌ కు చెందిన వెంకటేశ్‌‌ సెక్యూరిటీ గార్డ్‌‌. అతని సెల్ ఫోన్​కు సూపర్ లైక్ యాప్‌‌ లింక్‌‌ మెసేజ్‌‌ వచ్చింది. ఓపెన్​ చేయగా అడ్మిషన్ తీసుకోవాలంటే రూ.1,000 కట్టి గ్రూప్‌‌లో జాయిన్ కావాలని యాప్​ నిర్వాహకులు చెప్పారు. అలాగే ఆన్‌‌లైన్‌‌ లింక్స్‌‌ 25 స్క్రీన్ షాట్స్‌‌ తీసి అప్‌‌లోడ్ చేస్తే రూ.650 క్రెడిట్‌‌ చేస్తామని చెప్పారు. వారం రోజులు రూ.5,000 వచ్చాయి. మళ్లీ ఆ డబ్బులు డిపాజిట్‌‌ చేశాడు.  ఆ తర్వాత యాక్సెస్ కాకపోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్​చేశాడు.’’

హైదరాబాద్‌‌,వెలుగు: ఇన్‌‌స్టంట్‌‌ లోన్‌‌ యాప్స్‌‌పై పోలీసుల నిఘా పెరగడంతో సైబర్ క్రిమినల్స్​రూట్ మార్చారు. ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ యాప్స్‌‌ ప్లాన్ చేసి స్మాల్‌‌ ఇన్వెస్ట్ చేస్తే, డైలీ ఇన్‌‌కమ్‌‌ ఇస్తమంటూ ట్రాప్‌‌ చేస్తున్నారు. ఇలాంటివి గురుగావ్​, నొయిడా, బెంగళూర్‌‌, ముంబయి, వెస్ట్‌‌ బెంగాల్‌‌‌‌ అడ్డాగా ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ కంపెనీలు రన్​ అవుతున్నాయి.  80 కంపెనీల యాప్స్‌‌పై పోలీసు లు ఫోకస్‌‌ చేయగా వాటిలో సూపర్‌‌ ‌‌లైక్, న్యూ వర్క్స్‌‌, ఎస్‌‌ఆర్‌‌ ‌‌రూపీ యాప్స్‌‌ యాక్టీవ్‌‌గా ఉన్నట్లు గుర్తించారు.

సోషల్‌‌మీడియాలో లింక్స్‌‌తో ట్రాప్

సోషల్‌‌ మీడియా ఫ్లాట్‌‌ఫామ్‌‌పై చైన్ సిస్టమ్‌‌లో ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ ఫ్రాడ్​నడుస్తోంది. బల్క్‌‌ ఎస్‌‌ఎంఎస్‌‌లు,ఫేస్‌‌బుక్‌‌ ద్వారా ఐటీ ఎంప్లాయీస్, స్టూడెంట్స్‌‌ను టార్గెట్‌‌ చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి, ఎక్కువ సంపాదన అంటూ సెల్​ఫోన్లకు యాప్​లింక్స్‌‌ పంపిస్తున్నారు. క్లిక్‌‌ చేసిన వారిని తక్కువ పెట్టుబడి పెడితే, డెయిలీ ఇన్‌‌కమ్‌‌, గిఫ్ట్‌‌ ఆఫర్స్‌‌ ఇస్తామంటూ అట్రాక్ట్ చేస్తున్నారు. ముందుగా రూ.500 నుంచి రూ.30 వేల వరకు రిజిస్ట్రేషన్‌‌ ఫీజులుగా కట్టించుకుంటున్నారు. ప్రస్తుతం ఇలాగే సూపర్‌‌‌‌ లైక్‌‌, న్యూ వర్క్స్‌‌ యాప్స్‌‌  ట్రాప్ చేస్తున్నాయి. మెంబర్స్‌‌గా చేరిన వారికి ముందుగా లింక్స్‌‌ యాప్​ నిర్వాహకులు పంపిస్తారు. న్యూ వర్క్స్‌‌ యాప్స్‌‌ రిజిస్ట్రేషన్ చార్జీల కింద రూ.500 వసూలు చేస్తారు. వాటిని కూడా రీ ఫండ్ చేస్తామని బ్యాలెన్స్‌‌ చూపిస్తారు. అమెజాన్‌‌తో పాటు ఈ కామర్స్‌‌ సైట్స్‌‌లోని ఆర్టికల్స్‌‌ను యాప్‌‌ వెబ్‌‌ పేజ్‌‌లో కనిపించేలా పోస్ట్ చేస్తారు. వాటిని 50 నుంచి 75 సార్లు క్లిక్‌‌ చేయాలని సూచిస్తారు. అమౌంట్‌‌ డిపాజిట్‌‌ అవుతున్నట్లు తమ వర్చువల్ అకౌంట్స్‌‌లో చూపిస్తారు.

స్క్రీన్ షాట్స్‌‌ క్లిక్‌‌ చేయగా..

న్యూ వర్క్స్‌‌ యాప్‌‌లో  స్క్రీన్‌‌ షాట్స్‌‌ అప్‌‌ లోడింగ్‌‌ పేరుతో రూ.1,000 నుంచి రూ. లక్ష వసూలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న కస్టమర్లకు లింక్స్ పంపిస్తున్నారు. 45 నిమిషాల టాస్క్‌‌లో 15, 25, 50 స్క్రీన్ షాట్స్‌‌ టార్గెట్స్‌‌ పెడతారు.  రీచ్‌‌ అయిన వారికి  ప్రతిరోజు రూ.70‌‌‌‌‌‌‌‌0 నుంచి రూ.1,350 వరకు ఇన్‌‌కమ్ ఆశ చూపిస్తున్నారు. ఇందుకోసం ముందుగా రిజిస్ట్రేషన్, జీఎస్‌‌టీ, ఐటీ పేరుతో స్పెషల్ చార్జెస్‌‌ వసూలు చేస్తున్నారు. చైన్‌‌ సిస్టమ్‌‌లో మెంబర్స్‌‌ను జాయిన్ చేస్తే ఒక్కో స్క్రీన్ షాట్‌‌పై రూ.15 నుంచి రూ.25 కమీషన్‌‌ ఇస్తామని నమ్మిస్తున్నారు. ఇలా మోసపోయిన బాధితులు గురువారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్​ చేశారు.

వర్చువల్‌‌ అకౌంట్స్‌‌లో డిపాజిట్స్‌‌

డిపాజిటర్లు ఇన్వెస్ట్ చేసిన డబ్బుతో పాటు డెయిలీ ఎర్నింగ్‌‌ అమౌంట్‌‌, కమీషన్‌‌ పేరుతో యాప్‌‌ నిర్వాహకుల వర్చువల్ అకౌంట్స్‌‌లో మనీ కనిపిస్తుంది. అయితే విత్‌‌డ్రా చేసుకోవడానికి చాన్స్​ఉండదు . చేసుకోవాలంటే కండీషన్స్‌‌ ప్రకారం ప్రిన్సిపల్‌‌ అమౌంట్‌‌ మళ్లీ కట్టాలి. ఆ తర్వాత మొత్తం అమౌంట్‌‌ క్రెడిట్‌‌ అవుతుందని చెప్తారు.  టార్గెట్‌‌ పూర్తయ్యాక బాధితుడి అకౌంట్‌‌ను డిసెబుల్‌‌ చేస్తారు. దీంతో యాప్‌‌ అడ్రస్‌‌ తెలియక , పెట్టిన డబ్బులు రాక బాధితులు సైబర్​సెల్​పోలీసులకు వచ్చి కంప్లయింట్​ చేస్తున్నారు.

యాప్స్​పై అలర్ట్​గా ఉండాలె

“ సెల్​ఫోన్లకు వచ్చే యాప్స్‌‌ లింక్స్​ పై అలర్ట్​గా ఉండాలి. సైబర్​ క్రిమినల్స్​ ఫేక్ అడ్రస్‌‌లు, ఫోన్‌‌ నంబర్స్‌‌తో రన్‌‌ చేస్తుండగా, వీటి వెనుక కూడా చైనా యాప్స్‌‌ లింక్స్‌‌ ఉన్నాయి. మొదట డిపాజిట్‌‌ చేయించి తక్కువ ప్రాఫిట్స్‌‌ ఇస్తారు.  మళ్లీ మళ్లీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయించి పెద్ద మొత్తంలో లాగేస్తారు. విత్‌‌డ్రా చేసుకునే చాన్స్​ కూడా లేకుండా వర్చువల్‌‌ అకౌంట్స్‌‌లో బ్యాలెన్స్‌‌ చూపిస్తారు. న్యూ వర్క్స్‌‌ యాప్​ చీటింగ్‌‌పై ఇప్పటికే కంప్లయింట్స్​వచ్చాయి.’’                                                                      – కేవీఎం ప్రసాద్‌‌,ఏసీపీ, సైబర్‌‌‌‌క్రైమ్‌‌,హైదరాబాద్‌‌