అరకిలోమీటరు నిటారు కొండ.. ఎక్కేసిండు తాడు లేకుండ

అరకిలోమీటరు నిటారు కొండ..  ఎక్కేసిండు తాడు లేకుండ

‘మనం స్పీడ్‌‌‌‌గా ఉన్నప్పుడు చేతులు, కాళ్లు మన అదుపులో ఉండవు. అయినా ఫాస్ట్‌‌‌‌ తగ్గొద్దు. సేఫ్టీ చూసుకోవాలంటే చాలా చాలా ఏకాగ్రతతో ఉండాలి. ఎందుకంటే చిన్న మిస్టేక్‌‌‌‌ జరిగినా ఏమైతదో నాకు బాగా తెలుసు’

– డానీ ఆర్నాల్డ్‌‌‌‌

అసలు పర్వతమెక్కడమే మస్తు కష్టం. పైగా అది.. కొంచెం కూడా వంపు లేకుండా నిటారుగా ఉంది. కింద నిల్సొని అంచును చూస్తేనే మెడ పట్టేసేంత పొడవుంటది. తాడు సాయముంటే ట్రైనింగ్‌‌‌‌ ఉన్నోళ్లు కిందోమీదో పడి ఎక్కుతరేమో. కానీ మనోడు రోప్‌‌‌‌ లేకుండానే, మస్తు ఈజీగా ఎక్కేశాడు. అదేదో సినిమాలో డైలాగుంది కదా.. ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు, శ్రద్ధగా, పద్ధతిగా, అలవోకగా, ఆశ్చర్యపోయేలా అంచును చేరాడు. మనోడి దెబ్బకు ప్రపంచ రికార్డులేముంటయ్ చెప్పండి. తక్కువ టైంలో సమ్మిట్‌‌‌‌ను ఎక్కి రికార్డులను తిరగరాశాడు. 46 నిమిషాల 30 సెకన్లలో ఎక్కేశాడు.

ఇంతకుముందున్న రికార్డు కన్నా 20 నిమిషాల ముందే లక్ష్యం చేరుకున్నాడు. ఊరికే సమ్మిట్‌‌‌‌ ఎక్కడమే కాదు. తనకంటే ముందున్న ముగ్గురు క్లైంబర్లను దాటి ముందుకెళ్లాడు. అతని పేరు డానీ ఆర్నాల్డ్‌‌‌‌. స్విట్జర్లాండ్‌‌‌‌ దేశస్తుడు. ఎక్కిన మౌంటెయిన్‌‌‌‌ ఇటలీలోని సిమా గ్రాండ్‌‌‌‌లోని ఓ కొండను. దాదాపు అర కిలోమీటరు ఎత్తుంటుంది. ఉత్తరం సైడు ఫేసున్నవైపు నుంచి ఎక్కడం చాలా కష్టం. ప్రపంచంలోని హార్డెస్ట్‌‌‌‌ ఉపరితలాల్లో ఇదీ ఒకటి. కొండను ఎక్కడానికి ముందు మూడుసార్లు తాడు సాయంతో ఎక్కి ప్రాక్టీస్‌‌‌‌ చేశాడనుకోండి.

చిన్నప్పటి నుంచే..

చిన్నప్పటి నుంచే డానీ చెట్లు, పుట్టలను ఎక్కేవాడట. పెరిగిందే 1,700 మీటర్ల ఎత్తున్న ప్రాంతంలోనట. చుట్టూ కొండలే ఉంటే ఎక్కడం కాకుండా ఇంకో ఆప్షన్‌‌‌‌ ఉంటుందా? అంటున్నాడు. అందుకే తనకు కొండలెక్కడం అలవాటైందన్నాడు. యూరప్‌‌‌‌లోని ఆరు నార్త్‌‌‌‌ ఫేసెస్‌‌‌‌లో నాలుగింటి రికార్డు ఇతని పేరు మీదే ఉంది. ఫస్టుది జెర్మాట్‌‌‌‌లోని మట్టర్‌‌‌‌హార్న్‌‌‌‌. రెండోది గ్రాండెస్‌‌‌‌ జొరాస్సెస్‌‌‌‌. మౌంట్‌‌‌‌ బ్లాంక్‌‌‌‌ దగ్గరుంటది. మూడోది స్విడ్జర్లాండ్‌‌‌‌, ఇటలీ బార్డర్‌‌‌‌లోని బ్రెగగ్లియాలోని బడిలే. నాలుగోది ఇప్పుడెక్కిన సిమా గ్రాండ్‌‌‌‌. ఇంకా రెండు మిగిలున్నాయి కదా. అవి ఫ్రాన్స్‌‌‌‌లోని పెటిట్‌‌‌‌ డ్రూ. స్విడ్జర్లాండ్‌‌‌‌లోని ఐగర్‌‌‌‌. స్కాట్లాండ్‌‌‌‌లో ఐస్‌‌‌‌ క్లైంబింగ్‌‌‌‌ కూడా చేస్తాడంట.