తెలుగులోనూ HDFC వెబ్‌‌సైట్‌‌

తెలుగులోనూ HDFC వెబ్‌‌సైట్‌‌

ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌‌ దిగ్గజం హెచ్‌‌డీఎఫ్‌‌సీ  లిమిటెడ్‌‌తన వెబ్‌‌సైట్‌‌ను ఆరు ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తెచ్చింది. ఇంగ్లిష్​ కాకుండా, హిందీ, మరాఠి, తమిళ్‌‌, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఇక మీదట వెబ్‌‌సైట్‌‌ చూడొచ్చని ప్రకటించింది. ముఖ్యంగా ఇళ్ల లోన్లకు సంబంధించిన సమాచారాన్ని చూసుకునేందుకు ఎక్కువ మందికి వీలు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ చొరవ తీసుకున్నట్లు తెలిపింది.

ఇలా ప్రాంతీయ భాషల్లోనూ వెబ్‌‌సైట్‌‌ను అందుబాటులోకి తెచ్చిన ఏకైక  ఫైనాన్షియల్‌‌ సెక్టర్‌‌ సంస్థ హెచ్‌‌డీఎఫ్‌‌సీనే. ఇంటర్‌‌నెట్‌‌, స్మార్ట్‌‌ఫోన్‌‌ల వినయోగంతోపాటు, ప్రాంతీయ భాషల యూజర్ల సంఖ్యా పెరుగుతోందని, దీంతో పట్టణాలలోని కస్టమర్లను చేరుకునేందుకు ఈ చర్య సాయపడుతుందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ వెల్లడించింది.