పిట్టీ ఇంజినీరింగ్ లాభం రూ.40 కోట్లు

పిట్టీ ఇంజినీరింగ్ లాభం రూ.40 కోట్లు

హైదరాబాద్​, వెలుగు : ఎలక్ట్రికల్ స్టీల్ లామినేషన్స్, మోటార్,  జనరేటర్ కోర్ల సబ్-అసెంబ్లీలు,  ఫ్యాబ్రికేటెడ్ పార్టులు,  షాఫ్ట్‌‌లు తయారు చేసే పిట్టీ ఇంజినీరింగ్‌కు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో రూ.40 కోట్ల లాభం వచ్చింది. గత ఏడాది మార్చి క్వార్టర్​లో వచ్చిన లాభం రూ.25 కోట్లతో పోలిస్తే ఇది 60 శాతం పెరిగింది. సమీక్షిస్తున్న క్వార్టర్​లో ఆదాయం రూ.359 కోట్లకు గత రూ.263 కోట్లు పెరిగింది.

ఇబిటా 20 శాతం పెరిగి రూ.49 కోట్ల (గత క్యూ4లో రూ.41 కోట్లు) వద్ద ఉంది. బోర్డు ఈక్విటీ షేర్‌‌కు రూ.1.50 డివిడెండ్‌‌ను సిఫార్సు చేసింది. మరింత వృద్ధి కోసం డిబెంచర్ల జారీ ద్వారా రూ.360 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం 53 శాతం పెరిగి రూ.90 కోట్లకు ( గత ఏడాది రూ.59 కోట్లు) చేరింది. కార్యకలాపాల ద్వారా ఆదాయం రూ.1,245 కోట్లకు (రూ.1,118 కోట్లు) పెరిగింది. ఇబిటా 17 శాతం పెరిగి రూ.151 కోట్ల నుంచి రూ.178 కోట్లకు చేరింది.