
హైదరాబాద్, వెలుగు: అదనపు ఖర్చు లేకుండా టీవీ, ఓటీటీ కంటెంట్‌ను ఏ స్కీన్‌పైన అయినా చూసుకునే అవకాశాన్ని డిష్ టీవీ కల్పిస్తోంది. ఇందు కోసం ‘డిష్ టీవీ స్మార్ట్+’ సర్వీస్‌ను లాంచ్ చేసింది. డిష్ టీవీ, డి2హెచ్ కస్టమర్లు (పాత, కొత్త కలిపి) పాపులర్ ఓటీటీ యాప్‌లను, తమ టీవీ సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌ను ఎంజాయ్ చేయొచ్చు. ప్రాంతీయ భాషల్లోని కంటెంట్‌కు ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ పెరిగిందని, డిష్ టీవీ స్మార్ట్+ సర్వీస్‌లతో మరిన్ని సినిమా ఇండస్ట్రీలు, భాషల్లోని కంటెంట్ అందుబాటులోకి వస్తుందని నటి శ్రద్దా దాస్ అన్నారు. టీవీ, ఓటీటీ రెండూ కీలకమని, తమ కొత్త సర్వీస్‌తో ఈ రెండింటికి సమ ప్రాధాన్యం ఇస్తున్నామని డిష్ టీవీ ఇండియా సీఈఓ మనోజ్ డోబాల్ పేర్కొన్నారు.