పారాదీప్ దారుణం..యువతిపై అత్యాచారం చేసి.. బిల్డింగ్ పై నుంచి తోసేశారు

పారాదీప్ దారుణం..యువతిపై అత్యాచారం చేసి.. బిల్డింగ్ పై నుంచి తోసేశారు

అందరూ ఆమె ఆత్మ హత్య చేసుకుందనుకున్నారు.. ఏవో వ్యక్తిగత సమస్యలు ఉండటంతో బలవనర్మరణానికి పాల్పడిందనుకున్నారు. పోలీసులు కూడా  అదే జరిగిందని భావించారు. అయితే విచారణలో అసలు నిజం బయటపడింది. పారాదీప్ లో ఓ బిల్డింగ్ పై  నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న యువతి కేసులో సంచలన విషయాలు బయటికొచ్చాయి. 

ఫిబ్రవరి 22 అర్థరాత్రి ఒడిశాలోని పారాదీప్ లో  మహిళపై అత్యాచారం, హత్య కేసులో ఒడిశా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను విచారించగా  విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.  ఆమెది ఆత్మహత్య కాదని, హత్య అని  తేలింది. 

22వ తేదీన రాత్రి మృతురాలు తన బాయ్ ఫ్రెండ్ సోమ్ నాథ్ ఒఝాను కలిసిందుకు పారాదీప్ వెళ్లింది. అక్కడే ఇద్దరు గొడవపడ్డారు. ఆమె ఇంటికి వెళ్లే క్రమంలో సోమ్ నాథ్ ఆమెను పారాదీప్ మార్కెట్ సమీపంలో డ్రాప్ చేశారు.  మార్గమధ్యలో బాధితురాలికి నిందితుడు శుభం కుమార్ కలిశాడు. ఇంతకు ముందే పరిచయం ఉండటంతో అతనితో వెళ్లిన బాధితురాలిని ఓ బిల్డింగ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.  అనంతరం ఆమెను  బిల్డింగ్ నాల్గో అంతస్తునుంచి తోసేశాడు.

కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధితురాలి బాయ్ ఫ్రెండ్ సోమ్ నాథ్,  మరోనిందితుడు శుభం  కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి పోస్ట్ మార్టమ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చనిపోయే ముందు ఆమెపై రెండు సార్లు అత్యాచారం జరిగినట్టు తేలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్, శుభంకుమార్ ఇద్దరు ఆమెపై అత్యాచారం చేసినట్లు విచారణలో తేలింది. 

దర్యాప్తులో భాగంగా నిందితుడి మొబైల్ ఫోన్ నుంచి అడల్ట్ వీడియో కంటెంట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ విషయంపై తదుపరి దర్యాప్తు జరుగుతోంది.