కస్తూర్బా పాఠశాల దుస్థితిపై.. ఎమ్మెల్యే మందుల సామేల్ సీరియస్

కస్తూర్బా పాఠశాల దుస్థితిపై.. ఎమ్మెల్యే మందుల సామేల్ సీరియస్

తుంగతుర్తి, వెలుగు : తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను బుధవారం సందర్శించిన ఎమ్మెల్యే మందుల సామెల్, పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, డైనింగ్ హాల్ అస్తవ్యస్తంగా ఉండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాఠశాల ఇలాగే ఉంటుందా? మీ ఇల్లు అయితే ఇలాగే ఉంచుకుంటారా?’ అంటూ ఎస్ఓ వసంత, వర్కర్లతో పాటు పర్యవేక్షణ సరిగ్గా లేని ఎంఈఓ లింగయ్యను మందలించారు. 

ఈ దుస్థితిపై డీఈఓకు ఫోన్ చేసి వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  అంతకుముందు రూ. 36 లక్షల నాబార్డ్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రగతి రవి, నాయకులు పాల్గొన్నారు.