లైంగికదాడి కేసులో.. నిందితుడికి20ఏండ్ల జైలు శిక్ష

 లైంగికదాడి  కేసులో.. నిందితుడికి20ఏండ్ల జైలు శిక్ష

మెదక్/వనపర్తి, వెలుగు : వేర్వేరుగా జరిగిన ‘లైంగికదాడి’ కేసుల్లో మెదక్, వనపర్తి జిల్లాలోని నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఆయా జిల్లాల ఎస్పీలు డీవీ శ్రీనివాసరావు, సునితారెడ్డి బుధవారం తెలిపారు. ఎస్పీలు తెలిపిన వివరాల ప్రకారం..  మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో 15 ఏండ్ల బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అక్తర్‌‌కు జిల్లా ఫాస్ట్‌‌ట్రాక్‌‌ పోక్సో కోర్టు న్యాయమూర్తి ఆర్‌‌.ఎం. సుభావాలి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.20 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.లక్ష పరిహారం మంజూరు చేయాలని  తీర్పునిచ్చారు. వనపర్తి జిల్లా పరిధిలో మూగ యువతిపై లైంగికదాడికి యత్నించిన నిందితుడు గాడుదుల నాగశేషికి వనపర్తి ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు 7 ఏండ్ల  జైలు శిక్ష, రూ.61 వేల జరిమానా విధించారు.