వ్యాసాశ్రమంలో అక్రమాలపై సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణ జరపాలి

వ్యాసాశ్రమంలో అక్రమాలపై సిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విచారణ జరపాలి

బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సిట్ తో విచారణ జరపాలని తెలంగాణ వ్యాసాశ్రమం పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షుడు శంకర్ స్వామి, హైదరాబాద్​అధ్యక్షుడు సంపూర్ణానందగిరి స్వామి, ఉపాధ్యక్షుడు పరమానందగిరి స్వామి మాట్లాడారు.

ఆశ్రమ మూడో పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి, ఆయన సోదరుడు శివరాం, రాజకీయ నాయకుడు అమర్నాథ్ రెడ్డి కలిసి ఆశ్రమాన్ని వ్యాపార కేంద్రంగా మార్చారని ఆరోపించారు. వీలునామా నిబంధనలకు విరుద్ధంగా ఆశ్రమ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించి, సిట్ విచారణకు ఆదేశించాలని కోరారు.