నస్పూర్, వెలుగు: వేలం లేకుండానే సింగరేణికి కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లు కేటాయిస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ తెలిపారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని అర్కే7గనిని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్‌తో కలిసి కార్మికులతో మాట్లాడారు.
సింగరేణికి మణుగూరు పీకేవోసీ 2 డిప్ సైడ్ బ్లాక్ కేటాయించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కోల్ బ్లాక్ వల్ల 30 ఏళ్ల వరకు 180 మిలియన్ టన్నుల బొగ్గు అందుబాటులోకి వస్తుందన్నారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్రం రమేశ్, కుర్రె చక్రవర్తి, కమలాకర్‌రావు, ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటకృష్ణ, ఆనంద్ కృష్ణ, సదానంద, సదయ్య, భీమయ్య, మహేందర్, వెంకటేశ్, సతీశ్, సమ్మయ్య, నర్సయ్య, రవితేజ పాల్గొన్నారు.
