గోదావరిఖని/ రాజన్నసిరిసిల్ల/ఆదిలాబాద్/కోరుట్ల వెలుగు: సైబర్ నేరాల నివారణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రామగుండం సీపీ అంబర్కిశోర్ ఝా కోరారు. బుధవారం గోదావరిఖనిలోని సింగరేణి ఇల్లందు క్లబ్‌లో సైబర్ సేఫ్టీపై అధికారులు, ఉద్యోగులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం లలిత్‌కుమార్‌తో కలిసి పోస్టర్ఆవిష్కరించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రస్తుతం నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 30 శాతం ఇన్వెస్ట్‌మెంట్ మోసాలేనన్నారు. సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చినా, డబ్బు నష్టం జరిగినా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో డీసీపీ బి.రామ్‌రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డి, ఏసీపీ ఎం.రమేశ్, వన్‌టౌన్ సీఐ ఆఫ్జల్, రామగుండం సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రాణా ప్రతాప్, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు పాల్గొన్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలో ఎస్పీ మహేశ్ బి.గీతే ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీసులు ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహజన్ పాల్గొని మాట్లాడారు. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ‘సైబర్ జాగరూకత దివస్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్, ఏఎస్పీ చేతన్ నితిన్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సైబర్ భద్రతపై చైతన్యం కలిగించేలా నాటికను ప్రదర్శించిన ప్రదర్శించిన విద్యార్థులను ఎస్పీ అభినందించి వారికి బహుమతులు అందజేశారు.
