కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పద్మనగర్ ఫేజ్2లో బ్యాంక్ మేనేజర్ రేవంత్ కుమార్ (38) ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన విషాదం నింపింది. ఆర్ధిక ఇబ్బందులకు గురై, పలుచోట్ల అప్పులు చేసిన రేవంత్ కుమార్ అప్పులు తీర్చలేని స్థితిలో మానసిక ఒత్తిడికి లోనై ప్రాణాలు తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
