ముస్లింలపై అణచివేసే శక్తులతో భారత్ సన్నిహిత్యం

ముస్లింలపై అణచివేసే శక్తులతో భారత్ సన్నిహిత్యం
  • మోదీ ఇజ్రాయెల్​ పర్యటనను ఖండించిన అసదుద్దీన్​

హైదరాబాద్, వెలుగు: ముస్లింలపై అణచివేతకు దిగుతున్న శక్తులతో భారత ప్రభుత్వం సన్నిహిత సంబంధాలు పెంచుకుంటోందని మజ్లిస్​ పార్టీ అధినేత, హైదరాబాద్​ ఎంపీ అసదుద్దీన్  ఒవైసీ విమర్శించారు. శుక్రవారం ​ ఓల్డ్​ సిటీ మస్జిద్ -ఏ-చౌక్‌లో జరిగిన  భారీ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్  పర్యటనను తీవ్రంగా ఖండించారు. దేశంలో ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలపై మౌనంగా ఉండడాన్ని తప్పుబట్టారు.

తెలంగాణలోని వేములవాడలో దర్గా కూల్చివేతను మత స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. పరిపాలనా పేరుతో మైనారిటీ ఆరాధనా స్థలాలను ఎంపిక చేసి లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఇది ప్రమాదకర సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ముస్లింలపై ద్వేషం, మూకదాడి పెరిగిపోతున్నాయని, పవిత్ర రంజాన్ నెలలో  ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.